ఓటీటీలోకి మరో తెలుగు సినిమా నేరుగా రిలీజ్ కానుంది. ఫాదర్స్ డే కానుకగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించడంతో పాటు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో '30 వెడ్స్ 21' వెబ్ సిరీస్‌తో పాపులర్ అయిన చైతన్య రావు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఏ ఓటీటీలో రిలీజ్ కానుందనేది ఇప్పుడు చూద్దాం.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?)
షార్ట్ ఫిల్మ్ యాక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన చైతన్య రావు.. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు. రీసెంట్ టైంలో మాత్రం హీరోగా.. షరతులు వర్తిస్తాయి, అన్నపూర్ణ స్టూడియో, పారిజాత పర్వం తదితర చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించాడు. రీసెంట్‌గా 'పారిజాత పర్వం' మూవీతో వచ్చాడు. ఇది ఆహా జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనికి రెండు రోజుల గ్యాప్‌లోనే అంటే జూన్ 14 నుంచి 'డియర్ నాన్న' ఇదే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
'డియర్ నాన్న' కథ విషయానికొస్తే.. మెడికల్ షాప్ నడిపే తండ్రి (సూర్య) కొడుకుని ఫార్మసిస్ట్ చేయాలనుకుంటాడు. కానీ కొడుకు (చైతన్యరావు) చెఫ్ కావాలని కల కంటాడు. ఇలా భిన్న మనస్తత్వాల కారణంగా తండ్రికొడుకులు ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొన్నారు. చివరకు ఏం తెలుసుకున్నారు అనేదే పాయింట్. మూవీ బాగుంటే ఈ వీకెండ్ 'డియర్ నాన్న' బెస్ట్ ఆప్షన్ అవుతుందేమో!
(ఇదీ చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!)
Comments
Please login to add a commentAdd a comment