మధ్యతరగతి షరతులు  | Sharathulu Varthisthai Movie Trailer Launch | Sakshi
Sakshi News home page

మధ్యతరగతి షరతులు 

Published Mon, Mar 4 2024 1:12 AM | Last Updated on Mon, Mar 4 2024 1:13 AM

Sharathulu Varthisthai Movie Trailer Launch - Sakshi

చైతన్యా రావు, భూమి శెట్టి

చైతన్యా రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి దర్శకత్వంలో నాగార్జున సామల, శ్రీష్‌ కుమార్‌ గుండా, డా.  కృష్ణకాంత్‌ చిత్తజల్లు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ వేడుకలో హీరో చైతన్యా రావు మాట్లాడుతూ– ‘‘షరతులు వర్తిస్తాయి’ ట్రైలర్‌ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను.

దిగువ మధ్య తరగతి, మధ్యతరగతి వాళ్ల జీవితాల్లో ఉండే సంతోషాలు, బాధలు, భావోద్వేగాలతో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇందులో చిరంజీవి పాత్రలో నేను, విజయశాంతి పాత్రలో భూమి శెట్టి నటించాం. ప్రేక్షకులందరూ చూడాల్సిన చిత్రం ఇది’’ అన్నారు. ‘‘ఓ మంచి పాయింట్‌కు కమర్షియల్‌ హంగులు జోడించి ఈ సినిమా తీశాం. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన చిత్రం’’ అన్నారు కుమారస్వామి. ‘‘ఏషియన్‌ ఫిలిమ్స్, సురేష్‌ప్రోడక్షన్స్‌ మా సినిమాను రిలీజ్‌ చేస్తున్నాయి. ఇప్పటికి 60 థియేటర్స్‌ కన్ఫార్మ్‌ అయ్యాయి’’ అన్నారు డా. కృష్ణకాంత్‌ చిత్తజల్లు. ‘‘కరీంనగర్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం తెలంగాణ యాస నేర్చుకున్నా’’ అన్నారు భూమి. నటుడు సంతోష్‌ యాదవ్‌ మాట్లాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement