
హెబ్బా పటేల్, చైతన్యా రావు
‘నిజమా.. ఇది కనులు కల గన సాధ్యమా..’ అంటూ ప్రేమ పాట పాడుకున్నారు చైతన్యా రావు, హెబ్బా పటేల్. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ చిత్రంలోని పాట ఇది. ఎన్‌ఆర్‌ఐ ఎంటర్టైన్మెంట్స్ (యుఎస్‌ఎ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్‌పై కేకేఆర్, బాలరాజ్ నిర్మించారు.
బాల రాజశేఖరుని దర్శకుడు. ఈ చిత్ర సంగీతదర్శకుడు కల్యాణీ మాలిక్ స్వరపరచి, సునీతతో కలిసి పాడినన ‘నిజమా...’ పాటను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘నిజమా..’ పాట చాలా మెలోడియస్‌గా ఉంది.
లొకేషన్స్ బాగున్నాయి. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘రామ్‌గోపాల్ వర్మగారితో ‘బ్యూటీ ఆఫ్ ఫ్యాషన్, ఆట’ అనే రెండు హాలీవుడ్ చిత్రాలకు పనిచేశాను. నేను దర్శకుడు కావడానికి ‘శివ’ చిత్రం స్ఫూర్తి. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు బాల రాజశేఖరుని.
Comments
Please login to add a commentAdd a comment