hebha Patel
-
ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై హెబ్బా పటేల్ 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన కొత్త చిత్రం 'హనీమూన్ ఎక్స్ ప్రెస్'. తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. జూన్ 21న విడుదలైన ఈ సినిమాను న్యూ రీల్ ఇండియా బ్యానర్‌పై కేకేఆర్, బాలరాజ్ నిర్మించారు. రొమాంటిక్ కామెడీ కథాంశంగా దర్శకుడు బాల రాజశేఖరుని తెరకెక్కించారు. చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులు నటించారు.ప్రస్తుత సమాజంలో ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థియేటర్లో కాస్త పర్వాలేదు అనేలా ప్రేక్షకులను మెప్పించింది. అయితే, సడెన్‌గా 'హనీమూన్ ఎక్స్ ప్రెస్' ఓటీటీలోకి వచ్చేసి షాకిచ్చింది. సడెన్‌గా నేటి (ఆగస్ట్ 27) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. చైతన్య రావు, హెబ్బా పటేల్ మధ్య వచ్చే సీన్స్ కాస్త నెగటివ్‌ను తెచ్చిపెట్టాయని చెప్పవచ్చు. అయితే, ఈ చిత్రానికి ఐఎండీబీలో 8.7 రేటింగ్ ఉన్నటం విశేషం.కథేంటంటే..వేరు వేరు మనస్తత్వాలు ఉన్న సోనాలి(హెబ్బా పటేట్), ఈషాన్(చైతన్య రావు) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత తొలి రాత్రి నుంచే వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి. ముఖ్యంగా శృంగార జీవితాన్ని వీరిద్దరు ఆస్వాదించలేకపోతారు. కౌన్సిలింగ్ కోసం థెరపిస్ట్‌లను కలుస్తారు. అయినా ప్రయోజనం ఉండడు. ఓ సారి వీరిద్దరు కారులో వెళ్తుంటే.. ఓ వృద్ధ జంట(తనికెళ్ల భరణి, సుహాసిని) పరిచయమై హనీమూన్ ఎక్స్‌ప్రెస్(రిస్టార్ట్) గురించి చెబుతుంది. ఆ రిసార్ట్‌కి వెళ్లిన తర్వాత వీరిద్దరి ఎదురైన అభువాలు ఏంటి? అసలు ఈ వృద్ధ జంట ఎవరు? హనీమూన్ ఎక్స్‌ప్రెస్ కాన్సెప్ట్ ఏంటి? ప్రేమ వివాహం చేసుకున్న సోనాలి, ఈషాన్ శృంగార జీవితం సరిగ్గా ఉండకపోవడానికి గల కారణం ఏంటి? రిసార్ట్‌లోకి వెళ్లిన తర్వాత వీరిలో వచ్చిన మార్పు ఏంటి? చివరకు వీరిద్దరు విడిపోయారా? ఒక్కటయ్యరా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
హెబ్బా పటేల్ ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ ఎలా ఉందంటే..?
టైటిల్: హనీమూన్ ఎక్స్ప్రెస్నటీనటులు: చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులునిర్మాతలు: కేకేఆర్, బాలరాజ్ రచన, దర్శకత్వం : బాల రాజశేఖరునిసంగీతం: కళ్యాణి మాలిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ఆర్ పి పట్నాయక్ఎడిటింగ్ : ఉమా శంకర్ జి (యు ఎస్ ఎ), శ్రీ కృష్ణ అత్తలూరివిడుదల తేది: జూన్ 21, 2024కథేంటంటే.. వేరు వేరు మనస్తత్వాలు ఉన్న సోనాలి(హెబ్బా పటేట్), ఈషాన్(చైతన్య రావు) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత తొలి రాత్రి నుంచే వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి. ముఖ్యంగా శృంగార జీవితాన్ని వీరిద్దరు ఆస్వాదించలేకపోతారు. కౌన్సిలింగ్ కోసం థెరపిస్ట్‌లను కలుస్తారు. అయినా ప్రయోజనం ఉండడు. ఓ సారి వీరిద్దరు కారులో వెళ్తుంటే.. ఓ వృద్ధ జంట(తనికెళ్ల భరణి, సుహాసిని) పరిచయమై హనీమూన్ ఎక్స్‌ప్రెస్(రిస్టార్ట్) గురించి చెబుతుంది. ఆ రిసార్ట్‌కి వెళ్లిన తర్వాత వీరిద్దరి ఎదురైన అభువాలు ఏంటి? అసలు ఈ వృద్ధ జంట ఎవరు? హనీమూన్ ఎక్స్‌ప్రెస్ కాన్సెప్ట్ ఏంటి? ప్రేమ వివాహం చేసుకున్న సోనాలి, ఈషాన్ శృంగార జీవితం సరిగ్గా ఉండకపోవడానికి గల కారణం ఏంటి? రిసార్ట్‌లోకి వెళ్లిన తర్వాత వీరిలో వచ్చిన మార్పు ఏంటి? చివరకు వీరిద్దరు విడిపోయారా? ఒక్కటయ్యరా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ప్రస్తుతం విడాకులు అనేది చాలా సింపుల్ మ్యాటర్ అయిపోయింది.చిన్న చిన్న విషయాల్లో గొడవపడి విడిపోతున్నారు. భార్యకు నచ్చినట్లుగా భర్త, భర్తకు నచ్చినట్లుగా భార్య ప్రవర్తించకపోవడంతో గొడవలు మొదలవుతున్నాయి. ఒకరికొకరు సరిగ్గా అర్థం చేసుకుంటే కాపురంలో గొడవలే ఉండవు. ఈ పాయింట్‌తోనే హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌ని తెరకెక్కించాడు దర్శకుడు బాల రాజశేఖరుడు. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. కానీ అనుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంలో పూర్తిగా సఫలం కాలేదు. స్క్రీప్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సింది. చాలా చోట్ల కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. కథ ప్రారంభం కాస్త ఆసక్తికరంగా ఉన్నా.. ప్రేమ, పెళ్లి, శోభనం ఇదంతా చాలా సినిమాటిక్‌గా అనిపిస్తుంది. వృద్ధ జంట ఎంట్రీ తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ గేమ్ గురించి వివరించిన తర్వాత ఏదో జరగబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది. రిసార్ట్‌లోకి వెళ్లిన అక్కడ వచ్చే ట్విస్ట్ కథపై మరింత ఆసక్తిని పెంచుతుంది. అయితే ఆ ట్విస్ట్ తర్వాత క్లైమాక్స్ ఏంటో ఈజీగా అర్థం అవుతుంది. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు యూత్‌ని ఆకట్టుకున్నా..ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. బడ్జెట్ ప్రాబ్లమో ఇంకేదో కానీ.. చాలా సన్నివేశాలు చుట్టేశారనే ఫీలింగ్ కలుగుతుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా స్క్రీన్‌ప్లే బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. ఈషాన్ పాత్రకు చైతన్యరావు న్యాయం చేశాడు. డీసెంట్ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. హెబ్బా పటేల్ అందాల ప్రదర్శన ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నటన కంటే ఎక్స్ఫోజింగ్పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారు. సీనియర్ నటులు తనికెళ్ల భరణి, సుహాసిని డిఫరెంట్ పాత్రల్లో మెరిశారు. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కొంతవరకు ఓవరాక్షన్‌గా అనిపించినా.. నవ్వుకోవచ్చు. అలీ కనిపించేది ఒక సీన్లో అయినా..నవ్వించే ప్రయత్నం చేశాడు. అరవింద్ కృష్ణ, సురేఖ వాణి, రవి వర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతికంగా ఈ సినిమా జస్ట్ ఒకే. కల్యాణీ మాలిక్ అందించిన పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. నేపథ్యం సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘అలా నిన్ను చేరి’ మూవీ రివ్యూ
టైటిల్: అలా నిన్ను చేరి నటీనటులు: దినేష్ తేజ్, హెబా పటేల్, పాయల్ రాధాకృష్ణ, ఝాన్సీ, చమ్మక్ చంద్ర, శత్రు తదితరులు నిర్మాత: కొమ్మాలపాటి సాయి సుధాకర్ దర్శకత్వం: మారేష్ శివన్ సంగీతం: సుభాష్ ఆనంద్ సినిమాటోగ్రఫి: అండ్రూ ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు విడుదల తేది: నవంబర్ 10, 2023 కథేంటంటే.. వైజాగ్‌లోని వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడు గణేష్(దినేష్ తేజ్)కు సినిమాలు అంటే పిచ్చి. ఎప్పటికైనా దర్శకుడు కావాలని కలలు కంటుంటాడు. ఆ దిశగా ప్రయత్నిస్తున్న సమయంలోనే తన గ్రామానికి చెందిన దివ్య(పాయల్ రాధాకృష్ణ)తో ప్రేమలో పడతాడు. ఈ విషయం దివ్య తల్లి కనకం(ఝాన్సీ) దృష్టికి రావడంతో.. కూతుర్ని తన బంధువువైన కాళీ(శత్రు)కు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. దివ్య పెళ్లి విషయం తెలిసినా.. గణేశ్ అడ్డుకునే ప్రయత్నం చేయడు. తన లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం హైదరాబాద్‌కు వెళ్తాడు. సినిమా తీయాలన్న గణేష్ లక్ష్యం నెరవేరిందా? కాళీతో దివ్య పెళ్లి జరిగిందా? లేదా? ప్రేమించిన అమ్మాయి పెళ్లి జరుగుతున్నా..గణేష్ ఎందుకు ఆపలేకపోయాడు? హైదరాబాద్‌లో గణేష్ పడిన కష్టాలేంటి? అతని జీవితంలోకి అను(హైబ్బా పటేల్)ఎలా వచ్చింది? అను పరిచయంతో గణేశ్ జీవితం ఎలా మారింది? తను ప్రేమించిన అమ్మాయి దివ్య..తనను ఇష్టపడిన అమ్మాయి అను..ఇద్దరిలో ఎవరిని గణేష్ తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘అలా నిన్ను చేరి’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. లక్ష్యం కోసం ప్రేమను త్యాగం చేసిన ఓ మిడిల్ క్లాస్ యువకుడి కథే ‘అలా నిన్ను చేరి’. నేటితరం నచ్చే, మెచ్చే అంశాలతో ఫుల్ కమర్షియల్ ఫార్మాట్లో దర్శకుడు మారేష్ శివన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే రొటీన్ సన్నివేశాలు, స్క్రీన్‌ప్లే కారణంగా స్టోరీ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌ని చక్కగా డీల్ చేసిన దర్శకుడు.. సెకండాఫ్‌లో కాస్త తడబడ్డాడు. కానీ సాహిత్యం విషయంలో, నటీనటులను నుంచి తనకు కావాల్సిన నటనను రాబట్టుకోవడంతో మాత్రం సక్సెస్ అయ్యాడు. దర్శకుడిగా ఇది తొలి సినిమానే అయినప్పటికీ..కథను తీర్చి దిద్దిన విధానం బాగుంది. కథ ప్రారంభంగా రొటీన్‌గా ఉన్నా.. దివ్య, గణేష్ ప్రేమలో పడిన తర్వాత మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. హీరోయిన్ ప్రపోజ్ చేసే విధానం ఆకట్టుకుంటుంది. ఒకవైపు ప్రేమ..మరోవైపు లక్ష్యం రెండింటి మధ్య హీరో పడే సంఘర్షణకు సంబంధించిన సన్నివేశాలను దర్శకుడు చక్కగా రాసుకున్నాడు. పల్లెటూరి ప్రేమ కథ.. మంచి సాహిత్యంతో ఫస్టాఫ్ ఆకట్టుకుంటుంది. అయితే సెకండాఫ్‌లో మాత్రం కథ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. అను, గణేశ్‌ల మధ్య వచ్చే కొన్ని సన్నీవేశాలు సినిమాటిక్‌గా అనిపిస్తాయి. సినిమా చాన్స్‌కోసం హీరో చేసే ప్రయత్నాలకు సంబంధించిన సన్నివేశాలు కూడా రొటీన్‌గా అనిపిస్తాయి. కానీ ఫ్రీ క్లైమాక్స్ నుంచి కథ ఎమోషనల్‌గా సాగుతుంది. సినిమాను ముగించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. మిడిల్ క్లాస్ యువకుడు గణేష్ పాత్రకు దినేష్ తేజ్ న్యాయం చేశాడు. డ్యాన్స్, యాక్షన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చక్కగా నటించాడు. ఇక దివ్య పాత్రలో పాయల్ రాధాకృష్ణ ఒదిగిపోయింది. ఇది తనకు తొలి చిత్రమే అయినా.. ఆ విషయం తెరపై కనిపించకుండా నటించేసింది. దినేష్, పాయల్ల కెమిస్ట్రీ తెరపై చక్కగా పండింది. ఇక అను పాత్రకు హెబ్బా పటేల్ పూర్తి న్యాయం చేసింది. సెండాఫ్ మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. రంగస్థలం మహేశ్, చమ్మక్ చంద్ర, ఝాన్సీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. సుభాష్ ఆనంద్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం సినిమాకు ప్లస్ అయింది. కోడి బాయే లచ్చమ్మ పాటతో పాటు మిగతా సాంగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. అండ్రూ సినిమాటోగ్రఫీ సినిమాను రిచ్‌గా మార్చింది. ఎడిటర్ తన కత్తెర ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లోని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
'ఏంజిల్'గా కుమారి
అలా ఎలా సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన హేబాపటేల్ తరువాత కుమారి 21 ఎఫ్ సినిమాతో హాట్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్లో కనిపించిన ఈ బ్యూటి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తరువాత మరోసారి రాజ్ తరుణ్ సరసన నటించిన ఆడో రకం ఈడోరకం సినిమా కూడా సక్సెస్ సాధించటంతో ఇక హేబాకు వరుస అవకాశాలు క్యూ కడతాయని భావించారు. కానీ అలా జరగలేదు. సీనియర్ హీరోల సరసన సూట్ అవ్వకపోవటంతో పాటు యంగ్ హీరోల సరసన నటించడానికి భారీ పోటి ఉండటంతో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆడోరకం ఈడోరకం తరువాత యంగ్ హీరో నాగాన్వేష్ సరసన హీరోయిన్గా నటిస్తుంది హేబా. ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయిన నాగాన్వేష్ తరువాత వినవయ్యా రామయ్య సినిమాతో హీరోగా మారాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించకపోవటంతో కాస్త గ్యాప్ తీసుకొని మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. రాజమౌళి దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేసిన పళని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఏంజిల్ అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. -
అవికా గోర్ స్థానంలో హేబా పటేల్
సినీరంగం సక్సెస్ వెంటే పరిగెడుతోందన్న విషయం మరోసారి రుజువైంది. సుకుమార్ నిర్మాణంలో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కి ఘన విజయం సాధించిన సినిమా కుమారి 21 ఎఫ్. విడుదల సమయంలో డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల విషయంలో మాత్రం ఇండస్ట్రీ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన రాజ్ తరుణ్, హేబా పటేల్‌లు లీడ్ రోల్స్‌లో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మంచు విష్ణు హీరోగా తనే నిర్మిస్తున్న సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్‌కు రాజ్ తరుణ్‌ను ఎంపిక చేశారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్‌కు జోడీగా తొలుత అవికా గోర్‌ను తీసుకున్నారు. అయితే కుమారి 21 ఎఫ్ సక్సెస్ తరువాత మనసు మార్చుకున్న చిత్రయూనిట్, అవికా ప్లేస్‌లో హేబాను సెలెక్ట్ చేశారు. ప్రస్తుతం సీతమ్మ అందాలు, రామయ్య సిత్రాలు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న రాజ్ తరుణ్ ఆ తరువాత జి నాగేశ్వరరెడ్డి సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు. -
కుమారిలో నన్ను చూసుకున్నా! - హేభా పటేల్
‘‘జర్నలిస్ట్ కావాలన్నది నా ఆశయం. అనుకోకుండా మోడల్‌గా చేసే అవకాశం వచ్చింది. తొలిసారి కెమెరా ఫేస్ చేసినప్పుడు హీరోయిన్ అయితే బాగుంటుంది కదా అనిపించింది’’ అని హేభా పటేల్ అన్నారు. ‘అలా ఎలా’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముంబయ్ బ్యూటీ నటించిన తాజా చిత్రం ‘కుమారి 21 ఎఫ్’. సుకుమార్ కథ అందించండంతో పాటు ఓ నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ఇది. విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా హేభా చెప్పిన విశేషాలు... ‘అలా ఎలా’ చిత్రానికి సంబంధించిన ఓ ఇంటర్వ్యూలో నన్ను చూసి, సుకుమార్ ‘కుమారి 21ఎఫ్’కి అవకాశం ఇచ్చారు. ఇందులో నా పాత్ర పేరు కుమారి. ఏది అనిపిస్తే అది చేసేస్తుంది. ‘లివ్ అండ్ లెట్ లివ్’ అనే తరహా అమ్మాయి. నిజజీవితంలో కూడా నా మనస్తత్వం ఇలాంటిదే. అందుకే, కుమారిలో నన్ను నేను చూసుకున్నాను. ఈ చిత్రంలో నటించాలనుకోవడానికి ఓ కారణం హీరో పాత్రకు దీటుగా నా పాత్ర ఉండటం. మరో కారణం సుకుమార్‌గారు. ఆయన తీసే సినిమాల గురించి విన్నాను. బోల్డ్ సబ్జెక్ట్‌తో రూపొందిన చిత్రం ఇది. చిత్రదర్శకుడు సూర్యప్రతాప్ ఎలా చెబితే అలా నటించాను. నాకు దేవిశ్రీ ప్రసాద్ పాటలంటే ఇష్టం. ఆయన పాటలందించిన సినిమాలో నటిస్తానని అనుకోలేదు. రత్నవేలుగారు కెమెరా వండర్ఫుల్ అనే చెప్పాలి. హీరో రాజ్ తరుణ్ చాలా కో-ఆపరేటివ్. ఇక్కడి కథానాయికల్లో అనుష్క, హిందీలో కరీనా చాలా ఇష్టం. హీరోల్లో మహేశ్‌బాబు ఇష్టం. ఇటీవల ‘అఖిల్’ సినిమా చూశాను. అఖిల్ బాగా డ్యాన్స్ చేశాడు. -
లవ్‌కి బయోడేటాతో పనేంటి?
ఎవరినైనా ప్రేమించాలంటే ఎదుటి వాళ్ల మనసు మంచిదా? కాదా? వాళ్ల బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? లాంటివి వెరిఫై చేస్తారు. ఓ కుర్రాడు తన గాళ్‌ఫ్రెండ్ కుమారిని కూడా ఇలాగే అడిగితే...‘‘లవ్ చేయడానికి నా ఫిజిక్ చాలదా? నా బయోడేటా మొత్తం కావాలా?’’ అని ఎదురు ప్రశ్నిస్తుంది. మరి ఈ కుమారిని లవ్ చేయాలా? వద్దా? అని డైలామాలో పడతాడు ఈ ప్రేమికుడు. చివరకు ఈ ప్రేమకథ ఎన్ని మలుపులు తీసుకుందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘కుమారి 21ఎఫ్’. సుకుమార్ తొలిసారి నిర్మాతగా మారి కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ లవ్‌స్టోరీకి సూర్యప్రతాప్ పల్నాటి దర్శకుడు. రాజ్‌తరుణ్, హేభా పటేల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ-‘‘సుకుమార్ శైలిలో సాగే డిఫరెంట్ లవ్‌స్టోరీ ఇది. రాజ్‌తరుణ్ అభినయం, దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్.