కుమారిలో నన్ను చూసుకున్నా! - హేభా పటేల్ | Kumari Huawei me in! - Hebha Patel | Sakshi
Sakshi News home page

కుమారిలో నన్ను చూసుకున్నా! - హేభా పటేల్

Published Sun, Nov 15 2015 11:17 PM | Last Updated on Sun, Sep 3 2017 12:32 PM

కుమారిలో నన్ను చూసుకున్నా! - హేభా పటేల్

కుమారిలో నన్ను చూసుకున్నా! - హేభా పటేల్

‘‘జర్నలిస్ట్ కావాలన్నది నా ఆశయం. అనుకోకుండా మోడల్‌గా చేసే అవకాశం వచ్చింది. తొలిసారి కెమెరా ఫేస్ చేసినప్పుడు హీరోయిన్ అయితే బాగుంటుంది కదా అనిపించింది’’ అని హేభా పటేల్ అన్నారు. ‘అలా ఎలా’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముంబయ్ బ్యూటీ నటించిన తాజా చిత్రం ‘కుమారి 21 ఎఫ్’. సుకుమార్ కథ అందించండంతో పాటు ఓ నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ఇది. విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా హేభా చెప్పిన విశేషాలు...
 
‘అలా ఎలా’ చిత్రానికి సంబంధించిన ఓ ఇంటర్వ్యూలో నన్ను చూసి, సుకుమార్ ‘కుమారి 21ఎఫ్’కి అవకాశం ఇచ్చారు. ఇందులో నా పాత్ర పేరు కుమారి. ఏది అనిపిస్తే అది చేసేస్తుంది. ‘లివ్ అండ్ లెట్ లివ్’ అనే తరహా అమ్మాయి. నిజజీవితంలో కూడా నా మనస్తత్వం ఇలాంటిదే. అందుకే, కుమారిలో నన్ను నేను చూసుకున్నాను. ఈ చిత్రంలో నటించాలనుకోవడానికి ఓ కారణం హీరో పాత్రకు దీటుగా నా పాత్ర ఉండటం. మరో కారణం సుకుమార్‌గారు. ఆయన తీసే సినిమాల గురించి విన్నాను. బోల్డ్ సబ్జెక్ట్‌తో రూపొందిన చిత్రం ఇది. చిత్రదర్శకుడు సూర్యప్రతాప్ ఎలా చెబితే అలా నటించాను. నాకు దేవిశ్రీ ప్రసాద్ పాటలంటే ఇష్టం. ఆయన పాటలందించిన సినిమాలో నటిస్తానని అనుకోలేదు. రత్నవేలుగారు కెమెరా వండర్‌ఫుల్ అనే చెప్పాలి. హీరో రాజ్ తరుణ్ చాలా కో-ఆపరేటివ్.
  ఇక్కడి కథానాయికల్లో అనుష్క, హిందీలో కరీనా చాలా ఇష్టం. హీరోల్లో మహేశ్‌బాబు ఇష్టం. ఇటీవల ‘అఖిల్’ సినిమా చూశాను. అఖిల్ బాగా డ్యాన్స్ చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement