కమలహాసన్ ఇండియన్ –2 సినిమాలో మెరిసిన నటి ప్రియా భవానీ శంకర్ తాజాగా శుభవార్త చెప్పారు. త్వరలో తన ప్రియుడితో కలిసి ఏడు అడుగులు వేస్తున్నట్లు ప్రకటించింది. గోపీచంద్ భీమా సినిమాతో పాటు సంతోష్ శోభన్‌తో కల్యాణం కమనీయం అనే సినిమాలో నటించిన ఈ చెన్నై బ్యూటీ నాగచైతన్య ధూత వెబ్ సిరీస్‌తో తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఇప్పటికే ధనుష్, విశాల్, శింబు, కార్తి వంటి స్టార్ హీరోలతో ఆమె కలిసి నటించింది. ఆగష్టు 15న డీమాంటీ కాలనీ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మెసేజ్ చేసినా లింక్ పెట్టేశారు: ప్రియా భవానీ శంకర్
ప్రియా భవానీ శంకర్ తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజ్ అనే వ్యక్తితో తాను పదేళ్ల నుంచి రిలేషన్‌లో ఉన్నానని ఓపెన్ అయింది. సినీ పరిశ్రమలోకి రాక ముందునుంచే రాజ్‌తో ప్రేమలో ఉన్నట్లు ఆమె తెలిపింది. అయితే, ప్రియుడితో డేటింగ్‌పై ఆసక్తి చూపుతున్న ఈ బ్యూటీ పెళ్లి గురించి మాత్రం ఆలోచించడం లేదనే ప్రచారం జరిగింది. దీంతో వారిద్దరూ విడిపోయారంటూ ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
తాను చాలామంది హీరోలతో కలిసి నటించడం వల్ల ఏదైనా సందర్భంలో వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే వెంటనే తప్పుగా ప్రచారం చేశారని చెప్పింది. వారితో రిలేషన్‌లో ఉన్నానంటూ కూడా కామెంట్ చేశారని గుర్తుచేసుకుంది. లక్కీగా ఇప్పుడు వారందరికీ పెళ్లి అయిపోయిందని సరదాగా చెప్పుకొచ్చింది. ఒకవేళ కళాశాల చదువు పూర్తి అయిన తరువాత పెళ్లి ప్రపోజల్ వచ్చి ఉంటే రాజ్‌తో ఈ పాటికే జరిగి ఉండేదన్నారు. కాగా వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
తన ప్రియుడు రాజ్ గురించి చెబుతూ తన జీవితంలోకి రాజ్ రావడంతోనే అదృష్టం అని పేర్కొన్నారు. తను లేకపోతే తాను ఇప్పటికీ ఒక మధ్య తరగతి కుటుంబ యువతిగానే మిగిలిపోయేదాన్నని అన్నారు. రాజ్ అందించిన ప్రోత్సాహమే తనను ఈ స్థాయికి చేర్చిందనే అభిప్రాయాన్ని నటి ప్రియాభవానీ శంకర్ వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment