స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‌గా సీరియల్ బ్యూటీ | Priya Bhavani Shankar Got Chance In Ajith Vidaa Muyarchi, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Priya Bhavani Shankar: స్టార్ హీరో సరసన హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన సీరియల్ భామ

Published Fri, Oct 20 2023 5:24 PM | Last Updated on Fri, Oct 20 2023 5:48 PM

Priya Bhavani Shankar Got Chance In Ajith Vidaa Mayurchi - Sakshi

'తెగింపు' సినిమాతో ఈ ఏడాది హిట్ కొట్టిన అజిత్.. ప్రస్తుతం 'విడాముయర్చి' చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఆయన 62వ మూవీ. పలు ఇబ్బందులు క్లియర్ చేసుకుని, సెట్స్ పైకి వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి మగిళ్‌ తిరుమేణి దర్శకుడు. అనిరుధ్‌ సంగీతమందిస్తున్నాడు.  

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 29 సినిమాలు రిలీజ్)

ప్రస్తుతం అజర్ బైజాన్‌ దేశంలో షూటింగ్ జరుగుతోంది. త్రిష, హ్యూమా ఖురేషి హీరోయిన్లుగా నటిస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే హ్యూమా ఈ సినిమా నుంచి తప్పుకొందని ఆమె బదులు రెజీనాని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో మరో హీరోయిన్‌ కూడా ఉంటుందని ఆ పాత్రకు ప్రియా భవానిశంకర్‌ను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. 

ఇదే కనుక నిజమైతే అజిత్‌ సరసన ప్రియాభవానికి ఇది తొలి సినిమా అవుతుంది. ఇప్పుటివరకు యంగ్ హీరోల సరసన చేసిన ప్రియా భవానిశంకర్‌.. ప్రస్తుతం శంకర్‌-కమలహాసన్‌ కాంబోలో తీస్తున్న 'ఇండియన్ 2'లో నటిస్తోంది. ఈ బుల్లితెర నటి ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌ రేంజుకి చేరిపోయిందనమాట.

(ఇదీ చదవండి: రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement