Priya Bhavani Shankar Shares Romantic Video With Her Boyfriend - Sakshi
Sakshi News home page

Priya Bhavani Shankar : బాయ్‌ఫ్రెండ్‌తో వెకేషన్‌లో చిల్‌ అవుతున్న హీరోయిన్‌..

Published Tue, May 9 2023 8:58 AM | Last Updated on Tue, May 9 2023 10:14 AM

Priya Bhavani Shankar Shares Romantic Video With Her Boyfriend - Sakshi

బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన నటి ప్రియా భవానీ శంకర్‌. తొలి చిత్రం మేయాదమాన్‌ విజయం తర్వాత ఈమెకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం బిజీ హీరోయిన్లలో ప్రియ భవానీ శంకర్‌ ఒకరు. ఇటీవల ఈమె జయం రవి సరసన నటించిన అఖిలన్‌, శింబుతో జతకట్టిన పత్తుతల, లారెన్స్‌తో రొమాన్స్‌ చేసిన రుద్రన్‌ చిత్రాలు వరుసగా తెరపైకి రావడం విశేషం. వీటిలో రుద్రన్‌ చిత్రంలో లారెన్స్‌తో రొమాంటిక్‌ సన్నివేశాలు అందాలను ఆరబోసిందనే చెప్పాలి. కాగా నిజ జీవితంలోనూ తన ప్రియుడితో అలాంటి రొమాన్‌న్స్‌నే చేయడం గమనార్హం.

చదవండి: ఆ బాలీవుడ్‌ హీరోతో పూజాహెగ్డే రొమాన్స్‌

డబ్బు ఎక్కువగా వస్తుందని సినీ రంగ ప్రవేశం చేశానని బహిరంగంగా చెప్పిన నటి ప్రియా భవానీ శంకర్‌ తాను నటిగా పరిచయం అయ్యి 10 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచే ప్రేమ కలాపాలు నడుపుతోంది. రాజవేల్‌ అనే వ్యక్తిని ప్రేమిస్తున్న ఈ భామ అతనితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ వార్తల్లో ఉంటోంది. అదేవిధంగా తాజాగా తన ప్రియుడు రాజవేల్‌తో రొమాంటిక్‌గా దిగిన ఓ వీడియోను ప్రియా భవాని శంకర్‌ సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేసింది.

ఆ వీడియోలు ఆమె ప్రియుడితో ముద్దు మురిపాలతో, పాటు ఇతర స్నేహితులతో కలిసి ఆట, పాట, విందు, వినోదం అంటూ ఫుల్‌ ఎంజాయ్‌ చేసింది. ఆ వీడియో ఇప్పుడు సామాజి మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. సాధారణంగా టాప్‌లో ఉన్న హీరోయిన్లు తమ ఇమేజ్‌కు భంగం కలుగుతుందనే భయంతో బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంచుతుంటారు. అయితే ప్రియ భవానీ శంకర్‌ మాత్రం ఇమేజ్‌, భయం జాన్తానై అంటూ ప్రియుడితో సరసాలు ఆడేస్తోంది. ఈమె తక్కువ కాలంలోనే బోలెడంత ఆస్తులను కూడబెట్టిందనే ప్రచారం జరుగుతోంది. చదవండి: నవ్యస్వామితో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన 'విరూపాక్ష' నటుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement