కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం లియో. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్‌ఎస్ లలిత్‌కుమార్ భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్నారు. త్రిష కథానాయకిగా నటిస్తున్న ఇందులో పలువురు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోసిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. సగానికి పైగా షూటింగ్ పూర్తిచేసుకున్న లియో చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
(ఇది చదవండి: త్రిషకు వరుస ఛాన్సులు.. ఈసారి ఏకంగా ధనుష్‌తో జోడీ!)
కాగా తర్వాత విజయ్ నటించనున్న తన 68వ చిత్రం గురించి ఇప్పటికే ప్రచారం హోరెత్తింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో దర్శకుడు మిష్కిన్, యోగిబాబు ముఖ్యపాత్రల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. ఇకపోతే ఇందులో నాయకిగా నటించే అవకాశం త్రిష వరించినట్లు ఇప్పటికే వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.
(ఇది చదవండి: పెళ్లయిన నాలుగు నెలలకేనా?.. నటిపై దారుణ ట్రోల్స్..!)
ఇలాంటి పరిస్థితుల్లో మరో నటి పేరు తెరపైకి వచ్చింది. తనే ప్రియా భవాని శంకర్. ఇంతకు ముందు యువ హీరోలతో జతకడుతూ వచ్చిన ఈ భామ ఇటీవల పత్తుతల చిత్రంలో శింబు సరసన, లారెన్స్‌కు జంటగా రుద్రన్ చిత్రంలోనూ నటించారు. అలాంటిది తాజాగా దళపతి విజయ్‌తో రొమాన్స్ చేసే లక్కీ ఛాన్స్ వచ్చినట్లు టాక్. అయితే ఈ చిత్రంలో విజయ్‌కు జంటగా త్రిషతో పాటు ప్రియా భవాని శంకర్ నటించనున్నారా? లేక త్రిషను పక్కకు నెట్టి ప్రియా భవాని శంకర్ ఆ స్థానాన్ని చేజిక్కించుకున్నారా అనే చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment