
కోలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రియ భవాని శంకర్. ముందుగా బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ అమ్మడు ఇప్పుడు వెండితెర ప్రేక్షకులను అలరిస్తోంది. మేయాదమాన్ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈమె తొలి చిత్రంతోనే సక్సెస్‌ను అందుకుంది. దీంతో వరుసగా అవకాశాలు ఆమెను వరిస్తున్నాయి. ఆ తర్వాత ఎస్‌జే సూర్యతో జతకట్టిన మాన్‌స్టర్, కార్తీతో కడైకుట్టి సింగం చిత్రాలతో వరుస విజయాలు అందుకుని సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం అత్యధిక చిత్రాలు చేస్తున్న కథానాయికల వరుసలోనూ చేరింది. ఇటీవల ఈమె నటించిన ఓ మన పెణ్నే, యాన్నై చిత్రాలు విడుదలై ప్రజాదరణను పొందాయి.
చదవండి: దిక్కుతోచని స్థితిలో ‘గ్యాంగ్ లీడర్’ బ్యూటీ..!
ప్రస్తుతం ధనుష్‌కు జంటగా తిరిచ్చిట్రంబలం చిత్రం, అధర్వకు జంటగా, కురిదియాటం, శింబు సరసన పత్తు చిత్రాల్లో నటిస్తోంది. ఆ మధ్య కొంత షూటింగ్‌ను జరుపుకున్న పత్తు తల చిత్రం త్వరలో మళ్లీ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇలా యువ కథానాయకులతో నటిస్తూ దర్శక, నిర్మాతల నటిగా పేరు తెచ్చుకుంది. కాగా మొదట్లో పక్కింటి అమ్మాయిగా కనిపిస్తూ కుటుంబ సభ్యులను అలరించిన ప్రియ భవాని శంకర్ తాజాగా తాను మాత్రం తక్కువ తిన్నానా అంటూ గ్లామర్‌పై దృష్టి సారించి కుర్రకారును ఆకర్షించేలా, అదే సమయంలో దర్శక నిర్మాతలకు తన మరో ముఖాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. గ్లామరస్ దుస్తులు ధరించిన ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేస్తూ, అభిమానులకు టచ్‌లో ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment