
హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన ‘ఇండియన్’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లోనే ‘ఇండియన్’కు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, గండికోట లొకేషన్స్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ చెన్నైలో ప్రారంభమైంది.
ఈ షెడ్యూల్ చాలా కీలకమైనదని తెలిసింది. ఎందుకంటే నెల రోజుల పాటు నాన్‌స్టాప్‌గా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నారు కమల్‌హాసన్. ముందుగా కమల్‌హాసన్, హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ కాంబినేషన్స్‌లోని సీన్స్‌ను చిత్రీకరిస్తారట. ఈ షెడ్యూల్‌లోనే ఈ చిత్రకథానాయిక కాజల్ అగర్వాల్ కూడా జాయిన్ అయ్యే చాన్స్ ఉందని టాక్. ఇంకా రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా కీ రోల్స్ చేస్తున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.