
ఒక యువకుడికి తాను.. ఏడాదిన్నర పాటు సైట్‌కొట్టానని నటి ప్రియ భవాని శంకర్ చెప్పింది. ఎదుగుతున్న కథానాయికల్లో ఈమె ఒకరు. కోలీవుడ్‌లో పలు విజయాలను అందుకుని చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈమె.. కమలహాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఇండియన్–2 చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది.
ఇటీవల ఈమె ఓ రహస్యాన్ని బయటపెట్టింది. దీని గురించి ఒక భేటీలో పేర్కొంటూ గత కొన్నేళ్లుగా జిమ్‌కు వెళుతున్నానని చెప్పింది. అదే జిమ్‌కు వస్తున్న ఓ యువకుడి చూసి ఆకర్షణకు లోనైనట్లు చెప్పారు. దీంతో ఏడాదిన్నర పాటు అతనికి సైడ్ కొట్టానంది. వచ్చినపని మాత్రమే చేసుకుని వెళ్లిపోయే అతని ప్రవర్తన ఆకట్టుకుందని చెప్పింది. దీంతో చాలా రోజులు అతనికి సైట్ కొట్టానని అయితే తాను సైట్ కొడుతున్నట్లు అతనికి తెలియదని పేర్కొంది.
తనను ఒకసారి కూడా తనవైపు కన్నెత్తి చూడటం గానీ, పలకరించడం గానీ జరగలేదని చెప్పింది. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల తాను వేరే జిమ్‌కు మారడంతో ఆ యువకుడిని చూడలేదని తెలిపింది. అందరినీ గౌరవించే వ్యక్తులంటే తనకు ఇష్టమని చెప్పింది. అంతేకాకుండా తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుతో బీఎండబ్ల్యూ కారులో తిరిగే యువకుల కంటే స్వసక్తితో ఎదుగుతూ బైక్‌లో తిరిగే యువకులంటే తనకు అభిమానం అని వెల్లడించింది. ఇంతకీ తాను అంతగా సైట్ కొట్టిన యువకుడి వివరాలు మాత్రం ఆమె చెప్పలేదు.