టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్‌గా కొనసాగుతోంది ప్రియభవానీ శంకర్. ఈమె కథానాయకిగా నటించిన డీమాంటి కాలనీ 2 త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అదే విధంగా కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్–2 చిత్రంలోనూ ప్రియా భవానిశంకర్ నటించింది. అదేవిధంగా విశాల్ హీరోగా నటిస్తున్న 43వ చిత్రంలోనూ ఈమె యాక్ట్ చేస్తుంది.
ప్రేమలో మునిగి తేలుతున్న బ్యూటీ
ఇకపోతే ఈమె ప్రేమ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంది. దానిపై గతంలోనే క్లారిటీ ఇచ్చేసిందీ బ్యూటీ. తాను 18 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడ్డానంటూ బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఫొటోలను తరచూ నెట్టింట పోస్ట్ చేస్తోంది. తాను ప్రేమిస్తున్న వ్యక్తి పేరు రాజ్‌వేల్ అని కూడా చెప్పేసింది. శనివారం తన బాయ్‌ఫ్రెండ్ పుట్టినరోజు సందర్భంగా అతనితో క్లోజ్‌గా ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
సరదాలు, గొడవలు, ఏడుపులు..
అందులో ప్రియా భవానిశంకర్.. 'ఇక్కడున్న అబ్బాయి నాకు మంచి ఫ్రెండ్. మేము కలిసి నవ్వుకుంటాం, గొడవ పడుతాం, ఏడుస్తాం, తరచూ విడిపోతాం. రాజ్వేల్ తప్పుడు లిరిక్స్‌ను కూడా ఎంతో గట్టిగా ధైర్యంగా పాడుతుంటాడు. మేమిద్దరం వేర్వేరు భావాలు కలిగిన వాళ్లం. అయినప్పటికీ అతను నన్ను ఎప్పుడూ సంతోష పరుస్తుంటాడు. అతనితో నేను ప్రేమగా, జాలీగా ఉంటాను. అతడు తోడుంటే ఏ సమస్యలూ లేనట్లు ప్రశాంతంగా అనిపిస్తుంది. సాయంత్రం సంధ్యా వేళల్లో అతనితో ప్రశాంతంగా కూర్చొని సూర్యుడిని చూస్తూ నా మనసులోని కష్టాలను చెప్పుకోగలుగుతాను. ఈ జీవితానికి అది చాలు. కడవరకు ఆనందంగా గడిపేస్తాను..' అని ఎమోషనలైంది హీరోయిన్.
చదవండి: ఫిలింఫేర్ అవార్డ్స్.. యానిమల్, 12th ఫెయిల్ చిత్రాలకు అవార్డ్స్ పంట
Comments
Please login to add a commentAdd a comment