
ప్రియభవానీశంకర్
సినిమా: తొలి చిత్రం మేయాదమాన్ చిత్రంతోనే కోలీవుడ్ దృష్టని తనపై తిప్పుకున్న వర్ధమాన నటి ప్రియ భవానీశంకర్. అంతకుముందు బుల్లితెర వ్యాఖ్యాతగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ అటుపై నటిగా బుల్లితెరకు పరిచయమైంది. ఇప్పుడు వెండితెరపై మెరుస్తోంది. ఇటీవల కార్తీ నటించిన కడైకుట్టి సింగం చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న ప్రియభవానీశంకర్ ప్రస్తుతం ఈ అమ్మడు ఎస్‌జే.సూర్యకు జంటగా మాన్‌స్టర్, అధర్వతో కురుదిఆట్టం చిత్రాల్లో నటిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రియభవానీశంకర్ తాజాగా వెబ్ సీరీస్‌లో నటించడానికి సై అంది. అందులో నటుడు భరత్‌కు జంటగా నటించనుంది. ముఖ్యపాత్రల్లో నటుడు కరుణాకరన్, రోబోశంకర్ నటించనున్నారు. ప్రముఖ నటీనటులు కూడా ఇప్పుడు వెబ్ సిరీస్‌లో నటించడానికి రెడీ అంటున్నారన్నది తెలిసిందే. చాలా మంది ఇమేజ్ గురించి పట్టించుకోవడంలేదు. అంతేకాకుండా వెబ్ సీరీస్‌కు కూడా ప్రాచుర్యం లభిస్తోందన్నది గమనార్హం. నటి శ్రుతిహాసన్, నటుడు మాధవన్, రానా లాంటి వారు కూడా వెబ్ సీరీస్‌లో నటిస్తున్నారు. ఇప్పుడు నటుడు భరత్, ప్రియభవానీశంకర్ కూడా ఆ వరుసలో చేరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment