అజిత్‌ కొత్త సినిమా.. త్రిష అవుట్‌.. రంగంలోకి సీరియల్‌ బ్యూటీ! | Vidamuyarchi: Priya Bhavani Shankar To Star Opposite Ajith Kumar | Sakshi
Sakshi News home page

Priya Bhavani Shankar: అజిత్‌కు జంటగా ఒకప్పటి న్యూస్‌ రీడర్‌, కుర్ర హీరోయిన్‌

Published Wed, Oct 4 2023 11:28 AM | Last Updated on Wed, Oct 4 2023 11:46 AM

Vidamuyarchi: Priya Bhavani Shankar To Star Opposite with Ajith - Sakshi

మనిషి జీవితం చాలామటుకు అదృష్టం చుట్టే తిరుగుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతటి వారైనా ఆ అదృష్ట దేవత కోసం ఎదురు చూడాల్సిందే. అది ఒక్కసారి వరిస్తే జీవితం సెటిల్‌ అయిపోతుంది. హీరోయిన్‌ ప్రియ భవానీ శంకర్‌ పరిస్థితి ఇలాంటిదే. ఒక టీవీ న్యూస్‌ రీడర్‌గా పనిచేసిన ఈమె ఆ తర్వాత నటిగా అవతారం ఎత్తి టీవీ సీరియల్‌లో నటించింది. అది క్లిక్‌ అవడంతో సినీ రంగప్రవేశానికి ద్వారాలు తెరుచుకున్నాయి.

అలా మేయాదమాన్‌ చిత్రంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. తొలి చిత్రంతోనే సక్సెస్‌ తన ఖాతాలో వేసుకున్న ప్రియ భవానీ శంకర్‌కు వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయి. అయితే ఇప్పటివరకు పలు చిత్రాల్లో ఈమె నటించినా స్టార్‌ హీరోలతో జతకట్టే అవకాశం మాత్రం రాలేదు. అలాంటిది తాజాగా ఈ బ్యూటీకి అజిత్‌ సరసన నటించే అవకాశం వరించిందన్నది తాజా సమాచారం.

అజిత్‌ నటిస్తున్న తాజా చిత్రం విడాముయిర్చి. నిజానికి లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే పూర్తి కావాల్సింది. అయితే అనేక కారణాల వల్ల ఇప్పటికీ షూటింగ్‌ ప్రారంభం కాలేదు. ఈ సినిమాకు మొదట నయనతార భర్త, దర్శకుడు విగ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించాల్సింది. అనివార్య కారణాల వల్ల ఆయన ఈ చిత్రం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి. ఆ తరువాత దర్శకుడు మగిళ్‌ తిరుమేణి లైన్‌లోకి వచ్చారు. దీంతో అజిత్‌ చిత్రం త్వరగా సెట్‌పైకి వచ్చేస్తుంది అని భావించిన వారికి నిరాశ ఎదురైంది.

అజిత్‌ బైక్‌ టూర్‌ కారణంగా విడాముయిర్చి చిత్రం షూటింగ్‌ మరింత ఆలస్యమైంది. ఇదంతా నటి ప్రియా భవాని శంకర్‌ కోసమే అయ్యిందా అనిపిస్తోందిప్పుడు. ఎందుకంటే ఇందులో ఇప్పటివరకు హీరోయిన్‌ త్రిష కథానాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రియా భవానీ పేరు వినిపిస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

చదవండి: నిర్మాతను మోసం చేసిన డైరెక్టర్‌.. చివరి రోజుల్లో వైద్యానికి డబ్బుల్లేక..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement