AK 62: Aishwarya Rai, Trisha, Kangana Likely To Play Lead Roles - Sakshi
Sakshi News home page

అజిత్‌ ద్విపాత్రాభినయం.. ఆ ముగ్గురిలో ఇద్దరే హీరోయిన్స్‌!

Published Sat, May 13 2023 6:46 AM | Last Updated on Sat, May 13 2023 11:04 AM

AK 62: These Heroines Play Lead Role - Sakshi

హీరో అజిత్‌ తాజా చిత్రంపై చాలాకాలంగా రకరకాల చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదట్లో ఈ చిత్రానికి నయనతార భర్త విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేసుకున్నారు. ఆ తరువాత ఆయన్ని తొలగించారు. అందుకు కారణం అజిత్‌ అని, కాదు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌న్స్‌ అని రకరకాల ప్రచారం జరిగింది. ఏది ఏమైనా ప్రస్తుతం మగిళ్‌ తిరుమేణి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

జూన్‌ నుంచి షూటింగ్‌ కూడా మొదలు కాబోతోందని తాజా సమాచారం. దీనికి విడా మయర్చి టైటిల్‌ను కూడా అధికారికంగా యూనిట్‌ వర్గాలు ప్రకటించాయి. అంతా బాగానే ఉంది. కానీ, ఈ క్రేజీ చిత్రంలో నటించే హీరోయిన్‌ ఎవరనేది ప్రకటించలేదు. మొదట్లో హీరోయిన్‌ త్రిష అని ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాలేదు. విడా మయర్చి చిత్రం గురించి తాజాగా మరో స్టన్నింగ్‌ అప్‌ డేట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఇందులో అజిత్‌ ద్విపాత్రాభినయం చేయబోతున్నారన్నదే ఆ ప్రచారం. అయితే ఆయనతో రొమాన్స్‌ చేసే ఆ ఇద్దరు భామలెవరన్నదే ఆసక్తితో కూడిన ప్రశ్న. ఈ విషయంలో ఒక ఆసక్తికరమైన ప్రచారం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారట. ఈ పాత్రల కోసం ఐశ్వర్య రాయ్‌, త్రిష, కంగనా రనౌత్‌లలో ఇద్దరిని ఎంపిక చేసే ప్రయత్నంలో చిత్ర వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా త్రిష మరోసారి ఇందులో అజిత్‌తో జత కట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి కొద్ది రోజుల్లోనే హీరోయిన్ల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

చదవండి: రూమ్‌కు రమ్మని రెండుసార్లు పిలిచాడు.. నిర్మాతపై నటి ఆరోపణలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement