Raghuvaran
-
విలన్ని కూడా ఇష్టపడేలా చేశాడు.. ఈయన గొంతుకే సెపరేట్ ఫ్యాన్స్ (ఫొటోలు)
-
రఘువరన్‌కు భిన్నంగా వారసుడు.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
నటుడు రఘువరన్ పేరు వినగానే విలక్షణమైన పాత్రలే గుర్తుకొస్తాయి. టాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రాల్లో ప్రతినాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ చిత్రాలలోనూ రఘువరన్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. సినిమాల్లో నటించే సమయంలో నటి రోహిణిని పెళ్లాడారు. వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా జన్మించారు. అతనికి రిషివరన్ అనే పేరు పెట్టారు. అయితే 2004లో వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత చివరి రోజుల్లో ఆల్కహాల్‌కు బానిస అయిన రఘువరన్ 2008 మార్చి 19న కన్నుమూశారు.అయితే ప్రస్తుతం అతని కుమారుడు రిషి వరన్ తండ్రి బాటలోనే దూసుకెళ్తున్నాడు. 26 ఏళ్ల రిషివరన్ నటుడిగా కాకుండా సంగీతంలో రాణిస్తున్నాడు. సినిమాల్లో నటనకు బదులు రిషివరన్ సంగీత రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే అతను కొన్ని ఇంగ్లిష్ ఆల్బమ్‌లు రిలీజ్ చేశాడు. రఘువరన్‌కి సైతం సంగీతంపై కూడా చాలా ఆసక్తి ఉండేది. సినిమా అవకాశాలు పెరగడంతో నటనలో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం రిషివరన్ తండ్రిలాగే కొడుకు కూడా సంగీతంలో కొనసాగుతున్నాడు.కాగా.. గతంలో రఘువరన్ ఎంతో ఇష్టంగా కంపోజ్ చేసి, పాడిన ఆరు పాటలను ఆయన మరణం తరువాత ఓ ఆల్బమ్‌గా తీసుకొచ్చారు. గతంలో రజనీకాంత్ చేతులమీదుగా ఈ ఆల్బమ్‌ను ఆయన భార్య రోహిణి, రిషి వరన్ అందుకున్నారు. ఏది ఏమైనా రఘువరన్ విలక్షణమైన నటనతో జనం మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. రఘువరన్ తన కెరియర్లో 150కు పైగా సినిమాలలో నటించారు. టాలీవుడ్లో శివ, బాషా ,పసివాడు ప్రాణం వంటి సినిమాలలో నటించి బాగానే పేరు సంపాదించిన రఘువరన్.. చివరిగా ఆటాడిస్తా సినిమాలో కనిపించారు. ఆయన మాజీ భార్య రోహిణి బాలనటిగా పరిచయమై ఆ తర్వాత కథానాయికగా, ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దక్షిణాది ప్రేక్షకులను అలరించింది. ఇప్పటికీ ఆమె సినిమాల్లో కొనసాగుతున్నారు. -
విలక్షణ నటుడు, తన మాజీ భర్తను తలచుకున్న రోహిణి.. పోస్ట్ వైరల్!
నటుడు రఘువరన్ పేరు వినగానే ఆయన విలక్షణమైన పాత్రలు ముందుగా మన మనసులో గుర్తొస్తాయి. ఏ పాత్రల్లోలోనైనా పరకాయ ప్రవేశం చేసి.. జనాన్ని మెప్పించడంలో మేటి అనిపించుకున్నారు. దక్షిణాదిలో అన్ని భాషల్లో రఘువరన్ నటించారు. కొన్ని హిందీ చిత్రాలలోనూ రఘువరన్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. విలక్షణ నటునిగా జనం మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. చివరి రోజుల్లో ఆల్కహాల్‌కు బానిస అయిన రఘువరన్ 2008 మార్చి 19న కన్నుమూశారు. ఇవాళ రఘువరన్ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య, నటి రోహిణి మొల్లేటి తన భర్తను తలుచుకున్నారు. ఆయనకు నివాళులర్పిస్తూ ట్విటర్ ద్వారా ఫోటోను పంచుకున్నారు. రోహిణితో పెళ్లి కాగా.. నటి రోహిణితో రఘువరన్ వివాహం 1996లో జరిగింది. వారిద్దరికీ రిషి వరుణ్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే 2004లో వీరిద్దరు విడిపోయారు. విడిపోవడానికి గల కారణాలను రోహిణి అప్పట్లో బయటపెట్టింది. రఘువరన్ తాగుడు ముందు తాను.. తన కొడుకు ఓడిపోయామని రోహిణి అప్పట్లో వెల్లడించింది. రఘువరన్ ఎంతో ఇష్టంగా కంపోజ్ చేసి, పాడిన ఆరు పాటలను ఆయన మరణం తరువాత ఓ ఆల్బమ్‌గా తీసుకొచ్చారు. గతంలో రజనీకాంత్ చేతులమీదుగా ఈ ఆల్బమ్‌ను ఆయన భార్య రోహిణి, తనయుడు రిషి వరన్ అందుకున్నారు. ఏది ఏమైనా రఘువరన్ విలక్షణమైన నటనతో జనం మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. రఘువరన్ తన కెరియర్లో 150కు పైగా సినిమాలలో నటించారు. మంచి పేరు సంపాదియడమే కాకుండా ఎక్కువగా సక్సెస్ మెజారిటీని అందుకున్నారు. తెలుగులో పాటు ఇతర భాషలలో కూడా రఘువరన్ మంచి పేరు సంపాదించారు. టాలీవుడ్లో శివ, బాషా ,పసివాడు ప్రాణం వంటి సినిమాలలో నటించి బాగానే పేరు సంపాదించిన రఘువరన్.. చివరిగా ఆటాడిస్తా సినిమాలో కనిపించారు. కాగా.. ఆయన మాజీ భార్య రోహిణి బాలనటిగా పరిచయమై ఆ తర్వాత కథానాయికగా, ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దక్షిణాది ప్రేక్షకులను అలరించింది. ఇప్పటికీ విభిన్నమైన పాత్రల్లో రోహిణి మెప్పిస్తున్నారు. pic.twitter.com/HBy7RE5eCr — Rohini Molleti (@Rohinimolleti) March 19, 2024 -
Versatile Actor Raghuvaran: విలక్షణ నటుడు రఘువరన్ అరుదైన చిత్రాలు
-
కుమారుడి కోసం ఏడ్చేవాడు.. రఘువరన్ మృతిపై తొలిసారి మాట్లాడిన సోదరుడు
నటుడు రఘువరన్ పేరు వినగానే ఆయన విలక్షణమైన పాత్రలు ముందుగా మన మనసులో మెదలుతాయి. తాను ధరించిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి, జనాన్ని ఇట్టే కట్టిపడేయడంలో మేటి అనిపించుకున్నారు రఘువరన్. దక్షిణాది భాషలన్నిటా రఘువరన్ నటించి మెప్పించారు. కొన్ని హిందీ చిత్రాలలోనూ రఘువరన్ అభినయం ఆకట్టుకుంది. విలక్షణ నటునిగా జనం మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు రఘువరన్. చివరి రోజుల్లో ఆల్కహాల్‌కు బానిస అయిన రఘువరన్ 2008 మార్చి 19న కన్నుమూశారు. ఇదే విషయంపై తాజాగా ఆయన తమ్ముడు పలు ఆసక్తకరమైన వ్యాఖ్యలు చేశాడు. కుమారుడిపై అమితమైన ప్రేమ మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉండే రఘువరన్ సోదరుడు తొలిసారిగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. లైమ్ లైట్‌కు ఎప్పుడూ దూరంగా ఉండే రఘువరన్ గురించి చాలా మందికి తెలియదు. అయితే తాను ఎప్పుడూ రఘువరన్తోనే ఉండేవాడినని ఆయన తెలిపారు. 'అన్నయ్య చనిపోయిన రోజు నేను బెంగళూరులో ఉన్నాను. ఆరోజు రాత్రి తనకు ఛాతీ నొప్పి వస్తున్నట్లు తెలపడంతో ఇంట్లోని పనివారు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అన్నయ్య చనిపోయాడని వైద్యులు తెలిపారు. అన్నయ్య మరణానికి ముందే కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండేవి. దాని గురించి అందరికీ తెలుసు. అది అతనికి బాధ కలిగించింది. మానసికంగా, శారీరకంగా బాగా అలసిపోయాడు. అతను తన కొడుకును చాలా ప్రేమించాడు. అన్నయ్య,రోహిణి వేరువేరుగా ఉండటంతో వారంలో శనివారం మాత్రమే తన కుమారుడిని ఇంటికి తీసుకొచ్చుకునే అవకాశం ఉండేది. ఆదివారం తిరిగి వాళ్లు తీసుకుపోతారు. అది కోర్టు నిబంధన. కొడుకు పరుగున రాగానే నాన్న.. అని అంటాడు. (ఇదీ చదవండి: విశాల్‌పై పగ ఎప్పటికీ తగ్గదు.. సూర్య వెనకున్న శక్తి ఎవరంటే: అబ్బాస్) అప్పుడు ఆయన కన్నీరుపెట్టేవాడు. తన కుమారుడు ఎప్పుడైతే తిరిగి వెళ్లిపోతాడో అప్పుడు విపరీతంగా బాధపడేవాడు. అలా తన చివరి రోజుల్లో ఎంతగానో క్షోభను అనుభవించాడు. దాంతో మద్యానికి మరింత బానిస అయ్యాడు.' అని ఆయన గుర్తుచేసుకున్నాడు. అయితే అతను మద్యానికి బానిస కావడానికి కొన్ని వ్యక్తిగత కారణాలున్నాయి. అంటూనే పరోక్షంగా రోహిణినే అని తెలుపుతూ దీనిపై మాట్లాడే ఆసక్తి లేదని రఘువరన్ సోదరుడు తెలిపారు. రోహిణితో పెళ్లి నటి రోహిణితో రఘువరన్ వివాహం 1996లో జరిగింది. వారిద్దరికీ రిషి వరణ్ అనే కొడుకు ఉన్నాడు. అయితే 2004లో రఘువరన్, రోహిణి విడిపోయారు. విడిపోవడానికి గల కారణాలను రోహిణి అప్పట్లో బయటపెట్టింది. రఘువరన్ తాగుడు ముందు తాను, తన కొడుకు ఓడిపోయామని రోహిణి అప్పట్లో చెప్పింది. రఘువరన్ ఎంతో ఇష్టంగా కంపోజ్ చేసి, పాడిన ఆరు పాటలను ఆయన మరణం తరువాత ఓ ఆల్బమ్‌గా తీసుకువచ్చారు. రజనీకాంత్ చేతులమీదుగా విడుదలైన ఈ ఆల్బమ్‌ను ఆయన భార్య రోహిణి, తనయుడు రిషి వరన్ అందుకున్నారు. ఏది ఏమైనా రఘువరన్ విలక్షణమైన అభినయం జనం మదిలో ఓ స్థానం సంపాదించింది. (ఇదీ చదవండి: గుండెపోటుతో ప్రముఖ హీరో భార్య మృతి.. దిగ్భ్రాంతి చెందిన సీఎం) -
ఈరోజు రఘువరన్ బతికుంటే.. భర్తను గుర్తుచేసుకొని రోహిణి ఎమోషనల్
పోయినోళ్లు అందరూ మంచోళ్లే.. ఉన్నోళ్లు పోయిన వారి తీపి గురుతులు అంటారు. నటి రోహిణి అలాంటి ఘటనే గుర్తు చేసుకున్నారు. బాలనాటిగా పరిచయమై ఆ తర్వాత కథానాయికగా, ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్న నటి రోహిణి. నటుడు రఘువరన్ గురించి చెప్పాలంటే విలక్షణ నటుడు అన్నదానికి బ్రాండ్ అని పేర్కొనవచ్చును. కథానాయకుడిగా, ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వైవిధ్యమైన కథాపాత్రల్లో నటించి మెప్పించిన నటుడు ఈయన. తమిళంలో పూవిళి వాసలిలే, మనిదన్, ఎన్ బొమ్మ కుట్టి అమ్మావుక్కు, అంజలి, బాషా వంటి పలు చిత్రాల్లో తనదైనశైలిలో నటించి ఆ చిత్రాల విజయంలో భాగమయ్యారు. అలాంటి గొప్ప నటుడి ఆయుషు త్వరగా ముగియడం బాధాకరం. కాగా నటుడు రఘువరన్ నటి రోహిణి 1996లో ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 2004లో మనస్పర్థలు కారణంగా విడిపోయారు. కాగా రఘువరన్ 2008 మార్చి 19వ తేదీన కన్నుమూశారు. ఆయన వర్ధంతి సందర్భంగా నటి రోహిణి స్మరించుకుంటూ ఆమె, రఘువరన్ తమ బిడ్డతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. అందులో రఘువరన్ జీవించి ఉంటే నేటి సినిమాలు ఆయన కచ్చితంగా ఇష్టపడే వారని, ఒక నటుడుగా చాలా సంతోషించేవారని ఉద్వేగంతో పేర్కొన్నారు. ఆమె ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఏమో... గాడిద పాడవచ్చు!
విక్రమార్కుడి భుజాల మీద తిష్ట వేసిన బేతాళుడు గొంతు సవరించాడు. క్వశ్చన్ అడగడానికి రెడీ అయ్యాడు.‘‘ఇప్పుడు నేనొక ప్రశ్న అడుగుతున్నాను...’’ అని బేతాళుడు అనబోయాడో లేడో విక్రమార్కుడు అడ్డుకొని..‘‘ఆగవయ్యా బాబు’’ అంటూ కసురుకున్నాడు.‘‘మీ మూడ్ బాలేనట్లుంది. తర్వాత అడుగుతాలే...’’ నసిగాడు బేతాళుడు.‘‘మూడ్ బాగుండడం బాలేకపోవడం ఇక్కడ మ్యాటర్ కాదు. ఇదిసరే...నువ్వు ఒకే ఒక్కడు సినిమా చూశావా బేతాళా?’’ అడిగాడు విక్రమార్కుడు.‘‘ఒకే ఒక్కడే కాదు రాజమౌళి విక్రమార్కుడు సినిమా కూడా చూశాను’’ బదులిచ్చాడు బేతాళుడు.‘‘గుడ్. ఒకేఒక్కడు సినిమాలో అర్జున్‌కు రఘువరన్ ఒక సవాలు విసురుతాడు. నా సీట్లో ఇరవైనాలుగు గంటలు కూర్చుంటే తెలుస్తుంది నీకు అని... గుర్తుందా?’’ అన్నాడు విక్రమార్కుడు.‘‘ఎందుకు గుర్తు లేదు...ఆ సీన్ ఇప్పుడు నాకెందుకు గుర్తు తెస్తున్నావు?’’ అడిగాడు బేతాళుడు.‘‘ఆ సినిమాలో రఘువరన్‌లా నేను నీకు సవాలు విసురుతున్నాను. నువ్వు కొద్దిసేపు నా పాత్ర పోషించు. ఎప్పుడూ నువ్వు క్వశ్చన్ అడుగుతావు... నేను ఆన్సర్ చెబుతాను కదా! ఈసారి అలా కాదు... నేను క్వశ్చన్ అడుగుతాను. నువ్వు ఆన్సర్ చెప్పాలి. అప్పుడుగానీ అడిగే వాడికి చెప్పేవాడు ఎంత లోకువో తెలియదు’’ అన్నాడు విక్రమార్కుడు. ‘‘దాన్దేముంది రాజా! అడిగేయ్.... ఎంత టఫ్ క్వశ్చన్ అడిగినా జవాబు చెబుతాను’’ ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతుండగా అన్నాడు బేతాళుడు.గొంతు విప్పాడు విక్రమార్కుడు...‘‘ఆయన పేరు రంగభూపతినాయుడు. సిటీలో పేరున్న క్రిమినల్ లాయర్. నువ్వు ఎక్స్‌స్పెక్ట్ చేసినట్లుగానే ఆయనకొక ముద్దుల కూతురు. పేరు మృదుల. ఆమె స్వాతిముత్యంకుమార్ ప్రేమలో పడింది.తన పేరులాగే ఈ స్వాతిముత్యంకుమార్ పరమ సాత్వికుడు. భూపతినాయుడు ఆస్తి అంతస్తులతో పోల్చితే స్వాతిముత్యంకుమార్ ఏ మూలకూ సరిపోడు. స్వాతిముత్యంకుమార్ ఓ ఫైన్‌మార్నింగ్ భూపతినాయుడు ఇంటికివెళ్లి కాలింగ్‌బెల్ నొక్కాడు.అప్పుడే నిద్ర లేచిన నాయుడు తలుపులు తీసి ఆవులిస్తూ....‘‘ఎవరు నువ్వు? ఈ టైమ్‌లో ఎందుకువచ్చావు? నీకు నాతో పనెంటీ... ఒకవేళ ఉన్నా ఈ టైమ్‌లో ఏంటి...’’ ప్రశ్నల పరంపరతో దూసుకుపోయాడు భూపతినాయుడు.‘‘నమస్కారం సార్. నా పేరు స్వాతిముత్యం కుమార్. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మీ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది. మీరు ఆశీర్వదిస్తే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం’’ అంటూ చెప్పి ఒక కాగితం నాయుడు చేతికి ఇచ్చాడు స్వాతిముత్యంకుమార్.‘‘ఏమన్నావ్? నన్నెవరనుకుంటున్నావ్’’ దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు నాయుడు.సరిగ్గా ఆ టైమ్‌లోనే యోగా గురువు యోగానంద్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది.‘తన కోపమే తన శత్రువు... హెల్త్ సర్వనాశనం’వెంటనే కూలై పోయి....‘‘మా అమ్మాయిని పెళ్లాడతానంటావు. అంతేకదా! మరి ఈ కాగితం ఏంటమ్మా?’’ అడిగాడు నాయుడు.‘‘నా కండక్ట్ సర్టిఫికెట్ సార్’’ బదులిచ్చాడు స్వాతిముత్యంకుమార్.‘‘మా నాయినే. నీ బ్యాంక్ బాలెన్స్ ఎంత?’’ వెటకారం ధ్వనించేలా అడిగాడు నాయుడు.‘‘ఖాళీ... నా హృదయం అనే బ్యాంకులో మాత్రం వేల కోట్ల కంటే విలువైన ప్రేమ ఉంది’’ తన్మయంగా అన్నాడు స్వాతిముత్యంకుమార్.‘‘నీ కవిత్వానికేంగానీ, చిరంజీవి నటించిన ఛాలెంజ్ సినిమా చూశావా? మై డియర్ స్వాతిముత్యం?’’‘‘అప్పుడెప్పుడో టీవీలో వచ్చినప్పుడు చూశాను...’’‘‘అయిదేళ్లలో అయిదు లక్షలు సంపాదిస్తే నా కూతురుని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని రావుగోపాలరావు చిరంజీవితో అంటాడు. ఆ ఛాలెంజిని చిరంజీవి స్వీకరిస్తాడు. మరి నేను కూడా నీకో ఛాలెంజ్ విసురుతున్నాను. రెడీనా?’’ ‘‘రెడీ’’‘‘అదిగో ఆ మూలన కట్టేసిన గాడిదను చూశావా. గాడిదపాలు ఆరోగ్యానికి మంచివని చెబితే మొన్ననే కొన్నాను. ఈ గాడిదను నీకు ముందస్తు పెళ్లికానుకగా ఇస్తున్నాను.నువ్వు చేయాల్సిందేమిటంటే....వారం తిరిగేలోపు ఈ గాడిద ద్వారా లక్ష రూపాయలు సంపాదించాలి. అలా చేస్తే నీకు నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తాను.’’ ‘‘మీ ఛాలెంజిని స్వీకరిస్తాను. వారం తిరిగేలోపు మీ చేతిలో లక్ష కాదు... రెండు లక్షలు పెడతాను’’ ‘‘ఇప్పుడు చెప్పు బేతాళా! స్వాతిముత్యం రెండు లక్షలు సంపాదించాడా? ఒకవేళ సంపాదిస్తే ఎలా సంపాదించాడు? చెప్పకపోయావో.... ఇక నన్నెప్పుడూ వెధవ ప్రశ్నలు అడుగొద్దు’’ హెచ్చరించాడు విక్రమార్కుడు.బేతాళుడు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు:‘‘గాడిద లాటరీ.... పేరుతో రంగంలోకి దిగాడు స్వాతిముత్యం. ఎవరైనా గాడిద కోసం లాటరీ టికెట్ కొంటారా? ఎందుకు కొనరు? అది ఆషామాషీ గాడిద కాదు. పాటలు పాడే గాడిద. ‘కేవలం వేయి టికెట్లు మాత్రమే... ఒక్కో టికెట్‌కు వేయి రూపాయలు మాత్రమే!’ అని ప్రచారం ప్రారంభించాడు స్వాతిముత్యం. టికెట్లు హాటు కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆరోజు లక్కీడ్రా తీశారు. లాట్రీ ఎంకయ్య పేరు వచ్చింది. నిజానికి ఎంకయ్య ఇంటిపేరు లాట్రీ కాదు... మాటూరి. లాటరీ టికెట్ల పిచ్చి ఉండడంతో అందరూ ఎంకయ్యను లాట్రీ ఎంకయ్య అని పిలుస్తుంటారు. లాటరీ టికెట్ తగలడంతో తన జన్మధన్యమైంది అనుకున్నాడు ఎంకయ్య. వెయ్యిరూపాయలతో సొంతం చేసుకున్న గాడిదతో దేశవిదేశాల్లో సంగీతకచేరీలు పెట్టి కోట్లు సంపాదించాలని కలలు కంటూ స్వాతిముత్యం ఇంటికి వెళ్లాడు.పాడుతుంది అనుకున్న గాడిద పాడలేదు సరికదా... నాన్‌స్టాప్‌గా ఓండ్ర పెడుతూనే ఉంది.‘అన్యాయం... మోసం’ అని అరిచాడు వెంకయ్య.‘ఇదిగో నీ వెయ్యి రూపాయలు. దీంతో పాటు అయిదు లక్షలు కూడా ఇస్తున్నాను. విషయం మాత్రం ఎక్కడా బయటపెట్టవద్దు’ అని డబ్బుల సంచి ఎంకయ్య చేతిలో పెట్టాడు స్వాతిముత్యం.అంతే... అతడి నోరు మూతపడింది. తన దగ్గర ఉన్న మరో అయిదు లక్షలతో భూపతినాయుడు ఇంటికి వెళ్లాడు స్వాతిముత్యం,‘‘శబ్భాష్ బేతాళా! కఠినమైన ప్రశ్నలు అడగడమే కాదు... కఠినమైన ప్రశ్నలకు జవాబు కూడా చెప్పగలవని రుజువు చేశావు’’ అంటూ భుజం మీది బేతాళుడిని తెగ ప్రశంసించాడు విక్రమార్కుడు. – యాకుబ్ పాషా -
అమ్మా... అమ్మా... నీ పసివాణ్ణమ్మా...
లిరిక్ మేజిక్ మదర్స్ డే స్పెషల్ గుమ్మానికి బొట్టు ఉంటే ఇంట్లో అమ్మ ఉన్నట్టు. దండెం మీద నాన్న తువ్వాలు శుభ్రంగా ఆరి గాలికి మెల్లగా ఊగుతూ ఉంటే ఇంట్లో అమ్మ ఉన్నట్టు. పెరట్లో రాలిన బాదం ఆకులన్నీ కువ్వగా మూల చేరి, నీడన నులక మంచం, దాని పైన దిండు, ఆ పక్కనే డెబ్బై రెండు పేజీల తాజా తెలుగు వారపత్రిక రెపరెపలాడుతూ ఉంటే ఇంట్లో అమ్మ ఉన్నట్టు. నూరే రాయి మీద తేమ ఉంటే ఇంట్లో అమ్మ ఉన్నట్టు. ఆరే వడియాల వాసన సోకుతూ ఉంటే ఇంట్లో అమ్మ ఉన్నట్టు. క్యారియర్ డబ్బాల హడావిడి బోర్లగింత, తెర్లే పులుసు మీద ఉప్పు జారింత, వంటింటి పొగగొట్టం నల్లటి నిట్టూర్పులు, గడ్డ కట్టిన నెయ్యి సెగ తగిలినంతలోనే పులుముకునే ఎరుపు... ఇవి ఉంటే గనక ఇంట్లో కచ్చితంగా అమ్మ ఉన్నట్టు. రాత్రిళ్లు లేటుగా వస్తే తలుపు తీసే వాచ్మెన్, తప్పు చేస్తూ దొరికిపోతే వెనకేసుకొచ్చే క్లోజ్‌ఫ్రెండ్, ఏ సందర్భంలోనైనా వాదించడానికి సిద్ధంగా ఉండే ప్లీడర్... వీళ్లంతా ఒకరుగా ఉంటే డౌట్ లేదు ఇంట్లో అమ్మ ఉన్నట్టు. ఇంకా చెప్పాలా? ఇంట్లో సంస్కారం ఉంటే అమ్మ ఉన్నట్టు. కళ ఉంటే అమ్మ ఉన్నట్టు. ముసురు ముంచుకొచ్చే వేళ తెల్లటి దీపం వెలిగితే అమ్మ ఉన్నట్టు. అమ్మ ఉన్నప్పుడు ఇవన్నీ ఉన్నట్టుగా తెలియదు. అమ్మ లేనప్పుడే ఇవన్నీ పోయినట్టుగా తెలుస్తుంది. చెట్టంత కొడుకే కావచ్చు... వయసు తిరోగమనం పట్టి పసివాడైపోతాడు. గుప్పిళ్లలో అమ్మ చూపుడువేలి కోసం వెర్రెత్తి పోతాడు. అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా నువ్వే లేక వసివాడానమ్మా... ఉద్యోగం లేదు. అయితే ఏంటట? అమ్మ ఉందిగా. నాన్న తిడతాడు. అయితే ఏమవుతుందట? అమ్మ రహస్యంగా ఒక ముద్ద పెడుతుందిగా. ఖర్చులకు డబ్బుల్లేవు. అమ్మే ఏటీఎం. గర్ల్‌ఫ్రెండ్ దగ్గర దర్జా. అమ్మే బ్రాండ్ అంబాసిడర్. ఏ అమ్మయినా ఏదైనా చదువుతుందో లేదో కాని తన కడుపున పుట్టిన పిల్లలను మాత్రం క్షుణ్ణంగా చదువుతుంది. వాళ్లకేం కావాలో అమ్మకు తెలుసు. వాళ్లకు నొప్పి పుట్టే క్షణాన తన పేగు కదలడం తెలుసు. ఏం కావాలి అమ్మకు? మణులా మాణిక్యాలా? తన పిల్లలు నోటికింత తిని, ఒంటికింత కట్టి సంతోషంగా ఉండటం. అంతే కదా! అందుకే తను వేయి దేవుళ్లకు మొక్కుతుంది. అందుకే తను వేయి కళ్లతో వాళ్లను కాపాడుకుంటుంది. అంతెందుకు... వాళ్ల కోసమే తాను యముడితో పోరాడైనా ఆయుష్షు దక్కించుకుంటుంది. కాని ఓడిపోతే? బహుశా సంతానానికి ఆయువు పోయడానికే తన ఆయువును త్యాగం చేసిందేమో. అమ్మెందుకు నాన్నా చనిపోయింది? అనడిగితే సరిగ్గా చెప్పవలసిన జవాబు అదే- నీకు ఆయువు పోయడానికే నాన్నా. అందుకే అమ్మ లేదంటే నొప్పిగా ఉంటుంది. గుండె మండినట్టుగా ఉంటుంది. గొంతు చేదుగా మారుతుంది. పగలే దిగులైన నడిరేయి ముసిరింది కలవరపెడుతోంది పెనుచీకటి ఊపిరి నన్నొదిలి నీలా వెళ్లిపోయింది బ్రతికి సుఖమేమిటి... అంతా అయ్యాక మేల్కొని లాభం లేదు. ముందే అమ్మను చూసుకుని ఉంటే బాగుండేది... ముందే అమ్మను డాక్టర్‌కు చూపించి ఉంటే బాగుండేది... ముందే తనకో మంచి చీర కొనిచ్చి ఉంటే బాగుండేది... ముందే తనతో రెండ్రోజులు గడిపి ఉంటే బాగుండేది.... అనుకొని ఏం ప్రయోజనం! అమ్మ చేజారిపోయాక మణులూ మాణిక్యాలను గుప్పిళ్లతో పట్టుకుని ఏం లాభం! అమ్మ కోరే బ్లాంక్ చెక్ ఏమిటి? ఫోన్ చేసి- అమ్మా... ఎలా ఉన్నావ్ అన్న చిన్న పలకరింపు. అదీ ఇవ్వలేకపోయావా? తను కాల్ చేస్తే ఎత్తలేనంత బతుకు బాదరబందీలో కూరుకుపోయావా? అయ్యో వెళ్లిపోయావే నన్నొదిలేసి ఎటు పోయావే.... కాని అమ్మ ఎక్కడకు పోగలదు? కనపడకుండా పోయినా సరే కన్నబిడ్డలను కనిపెట్టుకునే ఉండగలదు. ఏ లోకాన ఉన్నా ఆమె ఆత్మ పరితపించేది వారి కోసమే. పిల్లల కోసం. తనను అమ్మా.. అమ్మా... అని పిలిచిన సంతానం కోసం. తను లేకపోయినా పిలిస్తే పలుకుతుంది. కాకుంటే మనకు వినిపించదు అంతే.విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసే లేనా నీ శ్వాసలోన మరణాన్ని మరచి జీవించి ఉన్నా ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన... అమ్మ ఉండలేదు. తన పిల్లలను వదిలి ఉండలేదు. వారికి దూరమయ్యి దూరలోకాల్లో అయినా సరే మనలేదు. అందుకే పరిగెత్తుకుని వచ్చేస్తుంది. తను కన్న సంతానం కడుపులో తిరిగి అమ్మైపుడుతుంది. అమ్మ రుణం తీర్చుకోగలిగాము అనేది పిచ్చిమాట. అమ్మ రుణం తీరదు. దోసిళ్లలోని మట్టితో నది నీరు ఎండదు.కలతను రానీకు కన్నంచున కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన చిగురై నిను చేరనా ... అమ్మ పాటలు చాలా వచ్చాయి. కాని అమ్మ కోసం కొడుకు, కొడుకు కోసం అమ్మ తమ పాశాన్ని వ్యక్తం చేసిన ఇటీవలి పాట ఇది. తెలుగువారు ఇటువంటి సెంటిమెంట్లకు నవ్విపోయే స్థితిలో ఉన్నారు. తమిళలు ఇంకా తమ సున్నితత్వాన్ని కోల్పోకుండా ఉన్నారు. అందుకు అమ్మ మోములాంటి ఈ అందమైన పాటే తార్కాణం. చిత్రం: రఘువరన్ (2015); రచన: రామజోగయ్యశాస్త్రి సంగీతం: అనిరుధ్ రవిచందర్; గానం: ఎస్.జానకి, దీపు