lamp post
-
‘నెహ్రూ వారసత్వం దీపస్తంభం వంటిది’
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఘనంగా నివాళులర్పించారు. నెహ్రూ వారసత్వం దీపస్తంభంలా నిలిచిపోతుందని, భారతదేశ ఆదర్శం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలను ప్రకాశింప జేస్తుందని రాహుల్ పేర్కొన్నారు. నెహ్రూ దూరదృష్టి, విలువలు ఎల్లప్పుడూ మనకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్ తదితరులు శనివారం శాంతివన్లోని నెహ్రూ స్మారకాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ‘మన మాజీ ప్రధాని నెహ్రూకు వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నా’అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. -
గొలుసులతో కూతుర్ని స్తంభానికి కట్టేసి..
8 ఏళ్ల బాలిక స్కూలు ఎగ్గొట్టినందుకు తల్లి క్రమశిక్షణ పేరుతో అమానుషంగా ప్రవర్తించింది. తల్లి ఆ పాప కాళ్లకు గొలుసులు వేసి, అపార్ట్మెంట్ బయట వీధిలో ఓ స్తంభానికి తాళం వేసి కట్టేసింది. మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఈ దారుణం జరిగింది. వీధిలో వెళ్తున్న వారు బాలిక దీనస్థితిని చూసి కాపాడేందుకు ప్రయత్నించారు. కాగా కాళ్లకు గొలుసులు వేసి తాళం వేసి ఉండటంతో వీలుకాలేదు. వాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడి చేరుకునే వరకు గంటకుపైగా ఆ అమ్మాయి అలాగే ఏడుస్తూ ఉండిపోయింది. స్కూలుకు వెళ్లనందుకు తన తల్లి గొలుసులతో కట్టివేసిందని ఆ పాప పోలీసులకు చెప్పింది. పోలీసులు పాప తల్లిని పిలిపించి తాళం తీయించి విడిపించారు. మరోసారి కూతురి పట్ల ఇలా ప్రవర్తించవద్దని పోలీసులు అమ్మాయి తల్లిని మందలించారు.