సిద్ధం కావాలి
► త్వరలో ఎన్నికలు తథ్యం
► కార్యదర్శులతో స్టాలిన్
► డీఎంకేలోకి రాధారవి
► సుప్రీంలో ‘స్థానికం’పై పిటిషన్
సాక్షి, చెన్నై: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎదుర్కొనేందుకు తగ్గ అస్త్రాలతో సిద్ధంగా ఉండాలని జిల్లాల కార్యదర్శులకు డీఎంకే కార్యనిర్వాహక అధ్య క్షుడు ఎంకే స్టాలిన్ సూచించారు. పార్టీ జిల్లాల కార్యదర్శుల సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. డీఎంకేలో సినీ నటుడు రాధారవి చేరారు. తేనాం పేటలోని అన్నా అరివాలయంలో జిల్లాల కార్యదర్శులతో స్టాలిన్ సమావేశం అయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ సమక్షంలో గంటన్నర పాటుగా జరిగిన ఈ సమావేశానికి ఉప ప్రధాన కార్యదర్శి దురై మురుగన్, ఎంపీ ఆర్‌ఎస్ భారతీ, టీకేఎస్ ఇళంగోవన్, సీనియర్లు ఏవీ వేలు, పొను్మడి, ఎంఆర్‌కే పన్నీరుసెల్వంతో పాటుగా వివిధ జిల్లాలకు చెందిన 65 మంది పార్టీ కార్యదరు్శలు హాజరయా్యరు. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై స్టాలిన్ సమీక్షించారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు తగ్గట్టు జిల్లాల్లో నేతలు, కేడర్ సిద్ధంగా ఉండాలన్న సూచనలు ఇచ్చారు. అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకునే విధంగా అస్త్రాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలపై కూడా చర్చించారు. ఇక, ప్రభుత్వాన్ని కూల్చడం లేదా, అధికారం చేజిక్కించుకోవడం లక్ష్యంగా జిల్లాలో్లని నేతలకు కొన్ని కీలక పనుల్ని స్టాలిన్ అప్పగించినట్టు సమాచారం. ఈ సందర్భంగా మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికలపై చర్చించామన్నారు. మరికొన్ని కీలక అంశాలపై కూడా చర్చించామని, వాటిని మీడియాకు చెప్పలేమని, చెప్పబోమని వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో ఆ కీలక నిర్ణయాలు ఏమిటో అన్న చర్చ బయల్దేరింది.
డీఎంకేలోకి రాధారవి: సినీ నటుడు, అన్నాడీఎంకే నాయకుడు రాధారవి డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరిన ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నాడీఎంకే కనుమరుగైనట్టేనని ప్రకటించారు. రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించాలన్నా, అన్ని రకాలుగా మేలు కలగాలన్నా డీఎంకే ద్వారానే సాధ్యమని రాధారవి అన్నారు. రాష్ట్రంలో సమర్దుడైన నాయకుడు ఒక్క స్టాలిన్ మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు.
కోరు్టలో పిటిషన్ : స్థానిక ఎన్నికలు మే 15లోపు నిర్వహించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ అప్పీలుకు ఎన్నికల యంత్రాంగం సిద్ధం అవుతోంది. ముందుగానే మేల్కొన్న డీఎంకే సుప్రీం కోర్టులో మంగళవారం కేవియట్ పిటిషన్ వేసింది. ఎన్నికల యంత్రాంగం అప్పీలుకు వస్తే, తమను సంప్రదించాలని ఆ పిటిషన్ ద్వారా విజ్ఞప్తి చేసింది.