► తారాస్థాయి కి ప్రచారం
► నియోజకవర్గాల్లో నేతలు
► ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం
► పర్యవేక్షణలో ఉమేష్ సిన్హా
ఉప ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ఎన్నికలకు మరో మూడు రోజులు మాత్రమే సమయంఉండడంతో ఏర్పాట్లను అధికార వర్గాలు వేగవంతం చేశాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ సహాయ కమిషనర్ ఉమేష్ సిన్హా ఏర్పాట్ల పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు.
సాక్షి, చెన్నై : తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరగుండ్రంలతోపాటు పుదుచ్చేరిలోని నెల్లితోపు అసెంబ్లీ నియోజకవర్గానికి ఈనెల 19న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. పంచముఖ సమరంగా అన్నాడీఎంకే, డీఎంకే, డీఎండీకే, పీఎంకే, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. మంగవారం తిరుప్పరగుండ్రంలో డీఎంకే దళపతి, ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ సుడిగాలి పర్యటన సాగించారు. ఓపెన్ టాప్ వాహనంలో నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లల్లో తన ప్రసంగంతో ఓటర్లను ఆకర్షించే యత్నం చేశారు. ఇక, అరవకురిచ్చిలో డీఎండీకే అధినేత విజయకాంత్, పీఎంకే అధినేత రాందాసు వేర్వేరుగా తమ తమఅభ్యర్థులకు మద్దతుగా జరిగిన ప్రచార సభలో ఓట్ల వేటలో పడ్డారు.
అ న్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతుగా మం త్రులు ఆయా నియోజకవర్గాల్లో ఇంటిం టా తిరుగుతూ ఆకర్షించే యత్నం చేశారు. ప్రచారానికి బుధవారం ఒక్క రోజు మాత్రమే గడువు ఉండడంతో సాధ్యమైన మేరకు మళ్లీ మళ్లీ ఆయా ప్రాంతాల్లో నేతలు పర్యటించే పని లో పడ్డారు. అన్నాడీఎంకే వర్గాలు గెలుపు లక్ష్యంగా కాలం చెల్లిన నోట్ల కట్టల్ని చల్లుతున్నట్టుగా డీఎంకే, డీఎండీకే, పీఎంకే, బీజేపీ అభ్యర్థులు ఆరోపించే పనిలో పడ్డారు. ఎన్నికల్ని రద్దు చేయాలని పీఎంకే, డీఎండీకే డిమాండ్ చేస్తుండడం గమనార్హం.
ఏర్పాట్ల వేగవంతం: ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల అధికారులు, పర్యవేక్షకులు ఏర్పాట్ల మీద దృష్టి సారించారు. ఇప్పటికే ఈవీఎంలలో చిహ్నా అమరికను పూర్తి చేశారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ముగించారు. ఇక, పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలించేందుకు తగ్గ కసరత్తుల మీద దృష్టి పెట్టారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ బూత్‌లలో సాగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షకులు పరిశీలిస్తున్నారు. ఇక, ఎన్నికల కమిషన్ సహాయ కార్యదర్శి ఉమేష్‌సిన్హా, రాష్ట్ర ఎన్నికల అధికారి రాజేష్ లఖానీలతో కూడిన బృందం మంగళవారం తంజావూరులో పర్యటించింది, అక్కడి అధికారులతో ఏర్పాట్ల మీద సమీక్షించారు.
భద్రతా చర్యలు, నగదు బట్వాడా అడ్డుకట్ట, ప్రశాంత పూరిత వాతావరణంలో ఎన్నికల విజయవంతం చేసేందుకు తగ్గ సూచనలు ఇచ్చారు. బుధవారం తిరుప్పరగుండ్రంలో ఈ బృందం పర్యటించనుంది. అరవకురిచ్చిలో అరుుతే, ఎన్నికల పర్యవేక్షకుడు వీకే కార్గ్, కరూర్ జిల్లా కలెక్టర్ గోవిందరాజ్‌లు పోలింగ్ కేంద్రాల్లో సాగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
ప్రచార హోరు
Published Wed, Nov 16 2016 3:52 AM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM
Advertisement