Umesh Sinha
-
ఏపీలో రీపోలింగ్‌పై నేడు నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోసున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రీపోలింగ్ జరపాల్సిన ఆవశ్యకతపై శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీనిపై ఎన్నికల సంఘం పరిశీలకులు శుక్రవారం ఉదయం పరిశీలిస్తారని పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ వివరాలను కేంద్ర ఎన్నికల సం ఘం డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్ సిన్హా గురువారం రాత్రి మీడియాకు వెల్లడించారు. ఏపీలో పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయని, హింసాత్మక సంఘటనల్లో ఒకరు మృతి చెందారని తెలిపారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలు దేశవ్యాప్తంగా 15 నమోదవ్వ గా.. అందులో 6 ఏపీలో అయ్యాయన్నారు. వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామ న్నారు. ఏపీలో కొన్నిచోట్ల ఈవీఎంల రీప్లేస్మెంట్ చేయడానికి కొంత సమయం పట్టినట్టు చెప్పారు. ఏపీలో 0.98 శాతం బ్యాలెట్ యూనిట్లను, 1.04 శాతం కంట్రోల్ యూనిట్లను, 1.6 శాతం వీవీ ప్యాట్లను రీప్లేస్ చేసినట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల పరిశీలకులు పోలింగ్ స్టేషన్లవారీగా పరిశీలన జరిపి రీపోలింగ్ ఆవశ్యకతపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారని వివరించారు. దాన్నిబట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు
సాక్షి, హైదరాబాద్: ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి తెలిపారు. సచివాలయంలో మంగళవారం సీఎస్‌ను కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్లు ఉమేష్ సిన్హా, సుదీప్‌జైన్ కలిశారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా, సీఈవో రజత్‌కుమార్, అడిషన్ సీఈవో బుద్ధప్రకాశ్‌జ్యోతి, ఆర్థికశాఖ అధికారి శివశంకర్, అడిషనల్ డీజీ(ఎల్వో) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ...పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు 145 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి బలగాల కేటాయింపుపై చర్చించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నందున ఈవీఎంలు ఈసీఐఎల్, బీహెచ్ఈఎల్ నుంచి వస్తున్నాయన్నారు. దీనికి అవసరమైన అదనపు సిబ్బంది, టేబుళ్లు, ఇంజనీర్ల కేటాయింపు, పోలింగ్ బూత్‌లలో సౌకర్యాలు తదితర అంశాలపై కూడా కేంద్ర ఎన్నికల అధికారులతో చర్చించారు. నిజామాబాద్ ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంలపై ప్రత్యేకంగా ప్రచారం నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పిస్తామని వారికి తెలిపారు. సీఈవో రజత్‌కుమార్ మాట్లాడుతూ..నిజామాబాద్ ఎన్నికలకు అవసరమైన అదనపు సిబ్బంది వివరాలు సమర్పిస్తామని, పోలింగ్ బూత్‌ల్లో చేపట్టాల్సిన అన్ని వసతులపై చర్యలు తీసుకుంటున్నామని నివేదించారు. -
ఛత్తీస్ రెండో దశలో 71.93% పోలింగ్
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం 71.93 శాతం ఓటింగ్ నమోదైందని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేశ్ సిన్హా తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగగా మావోయిస్టుల ప్రభావిత గరియాబంద్ జిల్లా బృందానవ్‌గఢ్ నియోజకవర్గంలోని రెండు పోలింగ్ బూత్‌లలో మాత్రం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 3 గంటలకే ముగిసింది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, ఆయన భార్య వీణ, కుమారుడు అభిషేక్ కువర్థా నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. పలు ఫిర్యాదులు రావడంతో బిలాస్పూర్ జిల్లా మర్వాహి నియోజకవర్గంలోని ప్రిసైడింగ్ అధికారితోపాటు సిబ్బంది ఒకరిని విధుల నుంచి తప్పించినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి తెలిపారు. ఫలితాలు డిసెంబర్ 11న వెలువడనున్నాయి. -
ప్రచార హోరు
► తారాస్థాయి కి ప్రచారం ► నియోజకవర్గాల్లో నేతలు ► ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం ► పర్యవేక్షణలో ఉమేష్ సిన్హా ఉప ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ఎన్నికలకు మరో మూడు రోజులు మాత్రమే సమయంఉండడంతో ఏర్పాట్లను అధికార వర్గాలు వేగవంతం చేశాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ సహాయ కమిషనర్ ఉమేష్ సిన్హా ఏర్పాట్ల పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు. సాక్షి, చెన్నై : తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరగుండ్రంలతోపాటు పుదుచ్చేరిలోని నెల్లితోపు అసెంబ్లీ నియోజకవర్గానికి ఈనెల 19న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. పంచముఖ సమరంగా అన్నాడీఎంకే, డీఎంకే, డీఎండీకే, పీఎంకే, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. మంగవారం తిరుప్పరగుండ్రంలో డీఎంకే దళపతి, ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ సుడిగాలి పర్యటన సాగించారు. ఓపెన్ టాప్ వాహనంలో నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లల్లో తన ప్రసంగంతో ఓటర్లను ఆకర్షించే యత్నం చేశారు. ఇక, అరవకురిచ్చిలో డీఎండీకే అధినేత విజయకాంత్, పీఎంకే అధినేత రాందాసు వేర్వేరుగా తమ తమఅభ్యర్థులకు మద్దతుగా జరిగిన ప్రచార సభలో ఓట్ల వేటలో పడ్డారు. అ న్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతుగా మం త్రులు ఆయా నియోజకవర్గాల్లో ఇంటిం టా తిరుగుతూ ఆకర్షించే యత్నం చేశారు. ప్రచారానికి బుధవారం ఒక్క రోజు మాత్రమే గడువు ఉండడంతో సాధ్యమైన మేరకు మళ్లీ మళ్లీ ఆయా ప్రాంతాల్లో నేతలు పర్యటించే పని లో పడ్డారు. అన్నాడీఎంకే వర్గాలు గెలుపు లక్ష్యంగా కాలం చెల్లిన నోట్ల కట్టల్ని చల్లుతున్నట్టుగా డీఎంకే, డీఎండీకే, పీఎంకే, బీజేపీ అభ్యర్థులు ఆరోపించే పనిలో పడ్డారు. ఎన్నికల్ని రద్దు చేయాలని పీఎంకే, డీఎండీకే డిమాండ్ చేస్తుండడం గమనార్హం. ఏర్పాట్ల వేగవంతం: ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల అధికారులు, పర్యవేక్షకులు ఏర్పాట్ల మీద దృష్టి సారించారు. ఇప్పటికే ఈవీఎంలలో చిహ్నా అమరికను పూర్తి చేశారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ముగించారు. ఇక, పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలించేందుకు తగ్గ కసరత్తుల మీద దృష్టి పెట్టారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ బూత్‌లలో సాగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షకులు పరిశీలిస్తున్నారు. ఇక, ఎన్నికల కమిషన్ సహాయ కార్యదర్శి ఉమేష్సిన్హా, రాష్ట్ర ఎన్నికల అధికారి రాజేష్ లఖానీలతో కూడిన బృందం మంగళవారం తంజావూరులో పర్యటించింది, అక్కడి అధికారులతో ఏర్పాట్ల మీద సమీక్షించారు. భద్రతా చర్యలు, నగదు బట్వాడా అడ్డుకట్ట, ప్రశాంత పూరిత వాతావరణంలో ఎన్నికల విజయవంతం చేసేందుకు తగ్గ సూచనలు ఇచ్చారు. బుధవారం తిరుప్పరగుండ్రంలో ఈ బృందం పర్యటించనుంది. అరవకురిచ్చిలో అరుుతే, ఎన్నికల పర్యవేక్షకుడు వీకే కార్గ్, కరూర్ జిల్లా కలెక్టర్ గోవిందరాజ్‌లు పోలింగ్ కేంద్రాల్లో సాగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.