బాపుగారి బొమ్మ సందడి
బంజారాహిల్స్, బాలాన గర్: కాంచిపురం వీఆర్‌కే సిల్క్‌్స సిటీలో తమ షోరూమ్‌లు విస్తరిస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్.2, కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీలో నెలకొల్పిన రెండు షోరూమ్‌లను సినీ నటి ప్రణీత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రణీత వివిధ రకాల పట్టు చీరలు ధరించి సందడి చేశారు. తనకు పట్టు చీరలంటే ఎంతో ఇష్టమని, మగువలు మెచ్చే అన్ని రకాల సిల్క్, పట్టు చీరలు ఆకర్షణీయమైన డిజైన్లలో ఒకే చోట లభించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో షోరూం ఎండీ రాజేందర్‌కుమార్ పాల్గొన్నారు.