కాంచీపురం చీరతో మైమరిపిస్తున్న త్రిష..! | Trisha Krishnan In A Kanchipuram Silk Saree Is A Slight Of Elegance | Sakshi
Sakshi News home page

కాంచీపురం చీరతో మైమరిపిస్తున్న త్రిష..!

Published Tue, Feb 6 2024 3:43 PM | Last Updated on Tue, Feb 6 2024 4:05 PM

Trisha Krishnan In A Kanchipuram Silk Saree Is A Slight Of Elegance  - Sakshi

తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా ఇప్పటికీ వరుస సినిమాలతో సౌత్‌ ఇండియాలో సందడి చేస్తున్న నటి త్రిష. వయసు పెరుగుతున్న కొద్దీ తరగని అందంతో యువతను మంత్రముగ్ధులను చేస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసి మెప్పించింది. సుమారు రెండు దశాబ్ధాలుగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఇటీవల స్టార్ హీరో విజయ్ నటించిన లియో సినిమాలో తళ్లుక్కున మెరిసింది త్రిష. నిజం చెప్పాలంటే ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఆమె క్రేజీ తగ్గలేదు. వరుస సినిమాలతో బిజీగా ఉందామె. ఈ నేపథ్యంలో ఆమెకు స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టడంలో ఉపయోగపడేది ఆమె ధరించే దుస్తులనే చెప్పాలి. సినిమాలో ఎలా ఉన్నా బయట ఎక్కడ కనిపించిన ఆరు గజాల చీరతో సంప్రదాయ మహిళలా కనిపించి ఈజీగా మనుసులను దోచుకుంటుంది. ఏ వేడుక ఫంక్షన్‌ అయినా అందుకు తగ్గట్టు ఆమె చీరలు ఉంటాయనే చెప్పాలి. ఈ సారి ఏకంగా కాంచీవరం చీరతో స్టన్నింగ్‌ లుక్‌తో మైమరిపోస్తోంది!

టాలీవుడ్‌ నటి త్రిష కృష్ణన్‌ ఏ వేడుకలో అయినా ఆమె సంప్రదాయ చీరలో ప్రత్యేక ఆకర్ణణగా కనిపిస్తారు. అంతెందుకు ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్‌లో కూడా జాడే అనే బ్రాండ్‌కి సంబంధించని ఎంబ్రాయిడర్‌ లేస్‌ బార్డర్‌ చీరలో తళుక్కుమన్నారు.  ఈసారి మరింత స్టన్నింగ్‌ లుక్‌లో అభిమానులను ఆశ్చర్యపరిచే రీతీలో కాంజీవరం చీరతో మైమరిపించారు. సాముద్రిక పట్టు చీరపై  కాంచీపుర పట్టు కళాత్మకత ఉట్టిపడేలా అందంగా ఉంది.  ఆ చీర నారింజ పట్టీ బార్డర్‌తో క్లిష్టమైన మీనాకారి జరీ వీవ్‌లు ఉన్నాయి.

ప్లేయిన్‌ కలర్‌ జాకట్‌ ఆ చీరకు మంచి లుకింగ్‌ తెచ్చిపెట్టింది. అది కూడా షార్ట్‌ హ్యాండ్‌ బ్లౌజ్‌తో చూస్తే సింపిల్‌గా ఉన్నా..చీర హెవీ వర్క్‌ దాన్ని భర్తీ చేసేలా అదిరిపోయింది. అలాగే ఈ కాంచీవరం చీరల అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు దాని స్టయిలే వేరు. అందుకు తగ్గట్టుగా త్రిష ధరించిన పచ్చ రాళ్లతో కూడిన నెక్లస్‌ ఒక జత బ్యాంగిలిస్‌, డాంగ్లింగ్‌ చెవిపోగులు సరిగ్గా మ్యాచ్‌ అయ్యాయి. మేకప్‌ కూడా పెద్దగా లేకుండా నేచురల్‌ లుక్‌లో ముగ్దమనోహరంగా కనిపించింది. అలాగే పెదాలు కూడా నేచురల్‌గా కనిపించే లిప్‌స్టిక్‌ రంగుతో జాగ్రత్త పడింది. చీర కట్టుకోవడమే గాక అందుకు తగ్గట్టు మేకప్‌ ఉంటే ఆ చీర లుక్‌ అదుర్స్‌ అన్నంత రేంజ్‌లో ఉంటుంది. సహజత్వం ఉట్టిపడేలా మేకప్‌ ఉంటే..ఏ సంప్రదాయ పట్టు చీర అయినా దాని అందం పదింతలు అవుతుంది అనేందుకు ఇదే ఉదాహరణ. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. ఇంకెందుకు ఆలస్యం త్రిష మాదిరి లుక్‌లో కనిపించేందుకు ట్రై చేయండి మరీ..!

(చదవండి: లెహంగా లుక్కే వేరు! ధరిస్తే ఏ వేడుకైనా గ్రాండ్‌గా వెలిగిపోవాల్సిందే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement