క్యాంపస్ అంబాసిడర్, వికాస్ శ్రీ వాస్తవ - ఐఐఐటీడీఎం - కాంచీపురం
ఇంజనీరింగ్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్‌లో విద్యార్థులను తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం దేశంలో ఏర్పాటు చేసిన సంస్థ.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ - కాంచీపురం. ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్న వికాస్ శ్రీ వాత్సవ తన క్యాంపస్ కబుర్లను చెబుతున్నారిలా...
భోజనం.. ప్రధాన సమస్య..
ఐఐఐటీడీఎంను 2007లో ఏర్పాటు చేశారు. మొత్తం 51 ఎకరాల వైశాల్యంలో క్యాంపస్ ఉంటుంది. కొన్ని నిర్మాణాలు ఇంకా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇక్కడ ప్రధాన సమస్య.. ఫుడ్. ఆహారం అసలు బాగోదు. మంచి క్యాంటీన్ కూడా లేదు. విద్యార్థులంతా చాలా స్నేహంగా ఉంటారు. తరగతి గదులు, లేబొరేటరీలు, సెమినార్ హాల్స్, మెషిన్స్, అకడమిక్ బ్లాక్స్, లైబ్రరీ అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి. ప్రత్యేకంగా డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్‌లో విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దేలా కరిక్యులం ఉంటుంది.
ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ
ఫ్యాకల్టీ అకడమిక్ సందేహాలను నివృత్తి చేస్తారు. అదేవిధంగా ప్రాజెక్టులలోనూ సహాయమందిస్తారు. ఇంటర్న్‌షిప్, మినీ ప్రాజెక్ట్స్ విషయంలో వీరిచ్చే గెడైన్స్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇక క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అంత గొప్పగా ఏమీ లేవు. ఎందుకంటే ముందే చెప్పినట్లుగా ఇన్‌స్టిట్యూట్ ఏర్పడి కొంతకాలమే అవుతుంది. నా కోర్సు పూర్తయ్యాక యూఎస్‌లో ఎంఎస్ చేయాలనుకుంటున్నా.