
ప్రచార బాట
రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. సోమవారం నుంచి ఏప్రిల్ ఐదో తేదీ వరకు తొలి విడతగా సుడిగాలి పర్యటన చేయనున్నారు. కాంచీపురం జిల్లా తేరడి నుంచి తన ఎన్నికల ప్రచారానికి జయలలిత శ్రీకారం చుట్టనున్నారు.
కొలిక్కిరాని దృష్ట్యా, 40 స్థానాల బరిలో తమ అభ్యర్థుల్ని జయలలిత ప్రకటించా రు. దీంతో ఆయా అభ్యర్థులు తమ నియోజకవర్గం పరిధుల్లో ఓటర్లను ఆకర్షించడం లక్ష్యంగా ఉరకలు పరుగులు తీస్తున్నారు. తమ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా ఓట్ల వేటకు ఆ పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత సిద్ధం స్వయంగా పర్యటించనున్నారు. సోమవారం నుంచి ఎన్నికల ప్రచార బాట పట్టనున్నారు. కాంచీపురం తేరడి నుంచి ఈ ప్రచారానికి ఆమె శ్రీకారం చుట్టనున్నారు.
పర్యటన సాగేది ఇలా...: ఏప్రిల్ ఐదో తేదీ వరకు సాగనున్న తొలి విడత ప్రచారంలో భాగంగా 13 లోక్ సభ నియోజక వర్గాల్లో ఆమె పర్యటించనున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభల రూపంలో ప్రచారం సాగనుంది. ఒక రోజు విరామం, మరో రోజు ప్రచారం అన్నట్టుగా పర్యటన సాగనున్నది. అధినేత్రి జయలలిత తమ జిల్లా నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నడంతో కాంచీపురం నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. చెన్నై - కాంచీపురం మార్గాన్ని అన్నాడీఎంకే జెండాలు,తోరణాలతో ముంచెత్తారు. ఆమె పర్యటన సాగే ప్రాంతాల్లో భద్రతను పెంచారు. వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు.
మార్చి 4: శ్రీ పెరంబదూర్ నియోజకవర్గం పరిధిలోని మీనంబాక్కం జైన్ కళాశాలలో బహిరంగ సభ
మార్చి 6: నాగపట్నం నియోజకవర్గం అవరిత్తిడల్, మైలాడుదురై నియోజకవర్గం సెంబనర్ కోయిల్ యూనియన్ కాళహస్తికాపురం.
మార్చి 9: కన్యాకుమారి నియోజకవర్గం నాగర్ కోయిల్ నాగరాజ తిడల్.
మార్చి 11: చిదంబరం నియోజకవర్గం చిదంబరం తేరు వీధి
మార్చి 13: ఈరోడ్ నియోజకవర్గం సిత్తోడి జంక్షన్, తిరుప్పూర్ నియోజకవర్గం అన్నానగర్, పెరుమానల్లూరువీధి.
మార్చి 15: కళ్లకురిచ్చి నియోజకవర్గం ఆర్కాడు మిల్, ఉలగన్‌కాత్తాన్, చిన్నసేలం
మార్చి 18: రామనాథపురం నియోజకవర్గం రాజభవన్, రామనాథపురం
మార్చి 19: తిరుచ్చి నియోజకవర్గం తొలూర్ ఉలవరన్ సంత.
మార్చి 21 : విరుదునగర్ నియోజకవర్గం కురుక్కు పాదై, శివకాశి - విరుదునగర్ జంక్షన్. శివగంగై నియోజకవర్గం గాంధీ విగ్రహం, కారైక్కుడి
మార్చి 23: పుదుచ్చేరి నియోజకవర్గం ఏఎఫ్‌టీ మైదానం కడలూరు రోడ్డు, ఉప్పళం
మార్చి 25: దిండుగల్ నియోజకవర్గం అంగువాలాస్ క్రీడా మైదానం, పళిని రోడ్డు.
మార్చి 28: వేలూరు నియోజకవర్గం కాట్టిక్కొలై, ఇడయాన్ గాడి, అనైకట్టు పంచాయతీ యూనియన్
ఏప్రిల్ 1: తూత్తుకుడి నియోజకవర్గం అన్నానగర్ మెయిన్ రోడ్డు
ఏప్రిల్ 1 : తేని నియోజకవర్గం బైపాస్‌రోడ్డు తేని నగరం
ఏప్రిల్ 5: తెన్‌కాశి నియోజకవర్గం ఉత్తర మాడ వీధి శంకరన్ కోయిల్‌తో ప్రచారం ముగుస్తుంది.
సాక్షి, చెన్నై : లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే మిగతా పార్టీలకంటే వేగంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో తిష్ట వేసి ఎన్నికల పనులు వేగవంతం చేస్తూ, ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.