
సాక్షి, చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాంచిపురం సెయ్యరు సమీపంలో లారీ, వ్యాన్ ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 31 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా ఓకే గ్రామానికి చెందినవారిగా సమాచారం. కాంచీపురంలోని ఓ వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది.
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. లారీ అతివేగంగా వచ్చి వ్యాన్‌ను ఢికొట్టడంతో వ్యాన్ నుజ్జునుజ్జయింది. వ్యాన్‌లో ఉన్న వారికి ఊపిరి ఆడకపోవడంతో ఆరుగురులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు త్వరగా స్పందించడంతో మృతుల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చెరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment