
హ్యాండ్‌బ్లూమ్
కాంచీపురం, ధర్మవరం, బెనారస్... ఈ పేర్లు వినపడగానే మన కు గుర్తుకొచ్చేది చీరలే. ఆ ప్రాంతాల ఉత్పత్తులన్నీ ఇప్పడు ఒక్కచోట చేరాయి. చీరలు మాత్రమే కాదు, చుడీదార్స్, మిడ్డీస్, లేడీస్ యాక్ససరీస్‌ని కూడా ప్రదర్శనలో ఉంచారు. హిమాయత్ నగర్ టీటీడీ కళ్యాణమండపంలో ‘జాతీయ సిల్క్ వస్త్ర ప్రదర్శన’ శనివారం ప్రారంభమయింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాల నుంచి తెచ్చిన విభిన్న డిజైన్లు ఇక్కడ కొలువుదీరాయి. దాదాపు 70 మంది డిజైనర్ల అత్యుత్తమమైన డిజైన్లు ఇక్కడ ఉన్నాయి. సంప్రదాయ పట్టు చీరలతో పాటు ప్రింటెడ్, నెటెడ్, కాటన్ శారీస్ ఆకట్టుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల ఉత్పత్తులకు సరైన మార్కెట్‌ను ఏర్పాటు చేసి తద్వారా వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఈ ప్రదర్శను ఏర్పాటు చేశారు. ఇవే కాదు... పెరల్స్, గోల్ట్ కోటెడ్ జ్యువెలరీ, లెదర్ బ్యాగ్స్, డ్రైప్రూట్స్ కూడా అందుబాటులోనే ఉన్నాయి. ఈ నెల 23 వరకు కొనసాగే ఈ ఎక్స్‌పోలో ధరల రేంజ్ రూ.500- రూ.15,000.