
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు విఫలం కావడంతో అదుపుతప్పి డివైడర్‌ను తాకుతూ జనాలపైకి దూసుకెళ్లింది. అటుగా వెళ్తున్న ఆటో , కార్లను ఢికొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment