సాక్షి, నల్లగొండ : ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నార్కెట్‌పల్లి నుంచి నల్లగొండకు వెళ్తున్న పల్లెవెలుగు బస్సు వెనుక చక్రం ఊడిపోయింది. రన్నింగ్‌లో ఉన్న బస్సు చక్రం ఊడిపోవడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన ఎల్లారెడ్డిగూడెం శివారులో చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తమై బస్సు నిలివేయడంతో ప్రమాదం తప్పింది. ప్రయాణీకులంతా సురక్షితంగా బయటకు వచ్చారు. బస్సులు దాదాపు 30 మంది ఉన్నారు.
కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అక్కడక్కడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.అనుభవం లేని డ్రైవర్లను పెట్టి ప్రయాణికుల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment