
సాక్షి, హైదరాబాద్ : అత్యంత భద్రత ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 7 ఏళ్ల బాలుడు కిడ్నాప్‌కు గురైయ్యాడు. గుర్తుతెలియని ఇద్దరు మహిళలు.. బిస్కెట్లు ఇప్పిస్తామని చెప్పి బాలుడిని ఎత్తుకెళ్లారు. బాలుడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్‌కు గురైన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదైయ్యాయని పోలీసుల తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు.