సికింద్రాబాద్లోని బోయిగూడలో ఈ రోజు తెల్లవారుజామున విద్యుదాఘాతంతో ఓ ఇంటిలో అగ్ని ప్రమాదం సంభవించింది.
సికింద్రాబాద్లోని బోయిగూడలో ఈ రోజు తెల్లవారుజామున విద్యుదాఘాతంతో ఓ ఇంటిలో అగ్ని ప్రమాదం సంభవించింది.ఆ ప్రమాదంలో ఓ వృద్దుడు మరణించాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.