ప్రతిఘటించడంతో నిప్పంటించిన మృగాళ్లు
సాక్షి, హైదరాబాద్: లైంగికదాడి యత్నాన్ని ప్రతిఘటించడంతో మృగాళ్లు కిరోసిన్ పోసి నిప్పంటిం చిన ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు శని వారం తెల్లవారుజామున మూడుగంటలకు మృతి చెందింది. చిలకలగూడ చింతబావికి చెందిన అర్షి యా ఫాతిమా అలియాస్ సమ్రీన్(22)ను గతనెల 29వ తేదీ మధ్యాహ్నం ఐదుగురు యువకులు.. మాట్లాడాలని పిలిచి, బలవంతంగా ఆటో ఎక్కించి చిలకలగూడ రైల్వేక్వార్టర్స్‌కు తీసుకువెళ్లి లైంగికదాడికి యత్నించడం, ఆమె ప్రతిఘటించడంతో కిరోసిన్ పోసి నిప్పంటించడం తెలిసిందే.
ఆర్తనాదాలు చేస్తూ రోడ్డుపైకి వచ్చి పడిపోయిన యువతిని గమనించిన స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే 95 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రి బర్న్స్‌వార్డులో చికిత్స పొందుతున్న బాధితురాలు సమ్రీన్ శనివారం తెల్లవారుజామున కన్నుమూసింది. దీంతో గాంధీ మార్చురీలో ఫోరెన్సిక్ వైద్యులు పోస్టుమార్టం చేసి.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సమ్రీన్ మరణించిన నేపథ్యంలో హత్యాయత్నం కేసును హత్య కింద పోలీసులు మార్చారు. ఈ కేసులో నిందితులు మహ్మద్ ఇసాక్, మహ్మద్ షబ్బీర్, మహ్మద్ ఇస్మాయిల్, సయ్యద్ షకీల్‌ను శుక్రవారమే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుని కోసం నిఘా బృందాల్ని రంగంలోకి దింపారు.
లైంగికదాడి బాధితురాలు మృతి
Published Sun, Feb 2 2014 3:52 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM
Advertisement
Advertisement