
రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ మృతి
సికింద్రాబాద్ : దక్షిణ మధ్య రైల్వే ట్రాక్ 2 డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస రావు రైల్వే క్వార్టర్స్‌లో బుధవారం మృతి చెందారు. గుండెపోటుతో మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రైల్ నిలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. రైల్వే లాన్సర్ కాలనీలోని 605/4 లో నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ స్వస్థలం గుంటూరు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు శ్రీనివాస్ భార్యకు సమాచారం అందించారు.