
సాక్షి, హైదరాబాద్ : దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఏజెంట్. పశ్చిమ గోదావరికి చెందిన ఓ యవతిని సికింద్రాబాద్‌కు రప్పించి లాడ్జికి తీసుకెళ్లాడు. అర్థరాత్రి దాటాక ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి కేకలు వేయడంతో అనుమానం వచ్చి లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడుని రిమాండ్‌కు తరలించారు.