అనారోగ్యంతో సీఎం బావ కన్నుమూత | KCR Second Sister Husband Passed Away Due To Health Issue | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో సీఎం బావ కన్నుమూత

Published Sun, Feb 9 2020 1:46 AM | Last Updated on Sun, Feb 9 2020 1:46 AM

KCR Second Sister Husband Passed Away Due To Health Issue - Sakshi

అల్వాల్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రెండో సోదరి భర్త అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిమడ్లకి చెందిన పర్వతనేని రాజేశ్వరరావు (84) హైదరాబాద్‌లోని అల్వాల్‌ మంగాపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. సీఎం సోదరి, రాజేశ్వరరావు సతీమణి విమలాదేవి గతేడాది చనిపోయారు. సీఎం కేసీఆర్‌ మధ్యాహ్నం 12 గంటలకు అల్వాల్‌ చేరుకుని రాజేశ్వరరావు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. రాజేశ్వరరావు మరణవార్త తెలుసుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఉదయమే అక్కడికి చేరుకుని రాజేశ్వరరావు పార్థివదేహం వద్ద నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌లు రాజేశ్వరరావు కుటుంబసభ్యులను పరామర్శించారు. మధ్యాహ్నం తిరుమలగిరి స్వర్గధామ శ్మశాన వాటికలో రాజేశ్వరరావు అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అక్కడే ఉన్నారు. 

రాజేశ్వరరావు పార్థివదేహానికి కేసీఆర్‌ నివాళులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement