
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అల్వాల్: నడి వీధిలో ఐదు నెలల పిండం పడేసిన ఘటన మచ్చబొల్లారం అంజనపూరి కాలనీలో గురువారం వెలుగు చూసింది. అంజనపురి కాలనీలోని రహదారి పక్కన పడిఉన్న పిండాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించినా ఎలాంటి ఆధారం లభించలేదు. రాత్రి సమయంలో వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.