హైదరాబాద్ అల్వాల్లో విషాదం చోటుచేసుకుంది. అదనపు కట్నం వేధింపులు భరించలేక ఐదు నెలల చిన్నారితో సహా తల్లి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్ : హైదరాబాద్ అల్వాల్లో విషాదం చోటుచేసుకుంది.అదనపు కట్నం వేధింపులు భరించలేక ఐదు నెలల చిన్నారితో సహా తల్లి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్ అల్వాల్ సీనియర్ సిటిజన్ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. మూడేళ్ల క్రితం త్రిశూల్‌నాథ్‌గౌడ్‌తో స్పందన వివాహాం జరిగింది.
అయితే అదనపు కట్నం కోసం కొద్దికాలంగా అత్తా, ఆడపడుచు తో కలిసి భర్త స్పందనను వేధించటం మొదలుపెట్టారు. ఆదివారం సాయంత్రం తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తిరిగివచ్చిన స్పందన భర్త వేధింపులు తాళలేక భవనంపై నుంచి దూకింది. అత్తింటి వేధింపుల వల్లే స్పందన ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.