
సాక్షి, అల్వాల్: అసలే చిన్న కుటుంబం.. బతుకుదెరువు కోసం ఒడిశా రాష్ట్రం నుంచి వలస వచ్చి జీవనంసాగిస్తున్నారు. ఏ కష్టం వచ్చిందో.. బిడ్డను చంపిన తల్లి తానూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయవిదారక సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం మయూర్‌భంజ్ జిల్లా బారిపాడకు చెందిన సుధేందుగిరి పాత అల్వాల్ భరత్‌నగర్‌లో నివాసముంటూ సిద్దిపేటలోని ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎనిమిదేళ్ల కిత్రం బిష్ణుప్రియ(30)తో అతడి వివాహం జరిగింది. వీరికి మూడున్నర సంవత్సరాల కూతురు హ్రితిక ఉంది.
ఈ నెల 22వ తేదీన సుధేందుగిరి యథావిధిగా ఉద్యోగానికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. కూతురు మృతి చెంది ఉండడం, బిష్ణుప్రియ ఉరివేసుకొని కనిపించడం గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. మొదట కూతురును చంపి తాను ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సుధేందుపరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని చంపి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులను కలిచివేసింది.
చదవండి: రూ.30 లక్షలు డిమాండ్.. తీన్మార్ మల్లన్నపై కేసు !
హ్రితికతో బిష్ణుప్రియ (ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment