
బిడ్డతో తల్లి శైలజ
హైదరాబాద్: ఆల్వాల్ ప్రాంతంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా ఓ తల్లి కన్న బిడ్డని అమ్మకానికి పెట్టింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం శైలజ అనే మహిళ చంకలో ఓ మగబిడ్డని పెట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాబుని కిడ్నాప్ చేసి తీసుకువచ్చి ఉంటారని తొలుత స్థానికులు భావించారు. పోలీసులు రంగంలోకి దిగి శైలజను, ఆమె చేతిలోని బిడ్డను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించడంతో ఆర్థిక పరిస్థితుల కారణంగా బిడ్డను అమ్మకానికి పెట్టినట్లు తెలిపింది. ఆ తన బాబేనని చెప్పింది.
తాను ఆల్వాల్ బొల్లారంలో ఉంటానని, తనను భర్త వదిలివేయడంతో బాబుని పోషించలేని పరిస్థితి ఏర్పడిందని శైలజ తెలిపింది. అందువల్ల ఒక బ్రోకర్ ద్వారా బాబుని లక్ష రూపాయలకు అమ్మడానికి సిద్ధపడినట్లు చెప్పింది. శైలజ చెప్పిన మాటల ఆధారంగా దీని వెనుక ఏదైనా ముఠా ఉందేమోన్న అనుమానంతో పోలీసులు ఆ కోణంలో పరిశోధన చేయడం మొదలుపెట్టారు. శైలజ మాట తీరు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు వివిధ కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.
**