పీఈటీల పోస్టులు భ ర్తీ చేయాలి
Published Thu, Jul 21 2016 6:40 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
పెగడపల్లి: మండలంలోని నంచర్ల, బతికపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులను భర్తీ చేయాలని ఆయా పాఠశాలల విద్యార్థులు కోరుతున్నారు. గతంలో ఆయా పాఠశాలలో పని చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు ఏడాది క్రితం బదిలీపై Ðð ళ్లగా వారి స్థానంలో ఇతరులను నియమించలేదు. దీంతో ఏడాది నుంచి తాము ఆటలకు దూరమవుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వ్యాయామ ఉపాధ్యాయులను భర్తీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
Advertisement
Advertisement