మీకు అత్యంత ఇష్టమైన పెంపుడు జంతువు చనిపోయిందా.. దానికి వినూత్నరీతిలో వీడ్కోలు పలకాలనుకుంటున్నారా..
హూస్టన్: మీకు అత్యంత ఇష్టమైన పెంపుడు జంతువు చనిపోయిందా.. దానికి వినూత్నరీతిలో వీడ్కోలు పలకాలనుకుంటున్నారా.. అయితే వాటి అస్థికల అవశేషాలను అంతరిక్షంలోకి పంపి ఘనమైన సెండాఫ్ ఇవ్వండి. ప్రైవేటు స్పేస్ ఫ్లైట్ కంపెనీ సెలెస్టిస్ మీకు ఈ అరుదైన అవకాశం కల్పిస్తోంది. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.
హూస్టన్‌కు చెందిన ఈ కంపెనీ ఇప్పటికే మనుషుల అస్థికలను అంతరిక్షంలోకి పంపుతోంది. ఇప్పుడు పెంపుడు జంతువులకు కూడా విస్తరించాలని నిర్ణయించింది. అయితే పెంపుడు జంతువుల అస్థికలను అంతరిక్షంలోకి పంపడానికి సుమారు రూ. 60 వేలు ఛార్జ్ చేస్తుంది సెలెస్టిస్. అదే చంద్రమండలం మీదకు పంపాలంటే రూ. 7.5 లక్షలు (12,500 డాలర్లు) వసూలు చేస్తుంది.