![Women Takes Care Of Crow In Khammam - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/22/pet.jpg.webp?itok=rVRjWHql)
సాక్షి, ఖమ్మం: ఎవరైనా కుక్కనో, చిలకనో పెంచుకుంటారు గానీ, కాకిని సాకుతారా? దానిని అందరూ అరిష్టం అంటారు. కానీ ఈమెకు మాత్రం ఇష్టం. దానిని ఎంచక్కా పెంచుకుంటోంది ఖమ్మం నగరంలోని రేవతి సెంటర్‌కు చెందిన మీనా. రెండేళ్ల క్రితం తన ఇంటి ముందు ఉన్న చెట్టుపై నుంచి కాకిగూడు కిందపడింది. దీంతో అందులోని ఐదు పిల్లల్లో ఒకటి చనిపోయింది. నాలుగు పిల్లలను మీనా చేరదీసింది. కొద్దిరోజులకు మరో రెండు చనిపోయాయి.
ఇంకో కాకిపిల్ల ఎటో ఎగిరిపోయింది. చివరికి ఏ‘కాకి’గా మిగిలిన దానికి వాణి అనే పేరు పెట్టి సాదుకుం టోంది. అది కూడా కుటుంబసభ్యురాలిగా ఆ ఇంట్లో కలిసిపోయింది. ఆ కాకి బయటకు వెళ్తే వాణి అని పిలిస్తే చాలు వచ్చి మీనా దగ్గర వాలిపోతుంది. అయితే, ఈ కాకిని పెంచుకోవడం వల్ల తమకు ఎటువంటి నష్టం జరగలేదని, మంచే జరుగుతోందని మీనా ఆనందం వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment