
హిమాయత్‌నగర్: పెట్ కారులో ఉండగానే మరిచిపోయి ఓ యజమాని డోర్ క్లోజ్ చేశాడు. పెట్‌తో పాటు కీస్ కూడా కారులోనే మరిచిపోవడంతో... దాదాపు 20 నిమిషాలు పెట్ అందులోనే ఉక్కిరిబిక్కిరైంది. వివరాలు... నారాయణగూడలోని సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్‌కు ముసారాంబాగ్‌కు చెందిన కీర్తి తన పెట్‌ను తీసుకొచ్చింది. కిందికి దించితే అల్లరి చేస్తుందనే ఉద్దేశంతో కారులోనే ఉంచింది. అయితే కారు కీస్ కూడా లోపలే ఉండడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. డోర్ తీసేందుకు స్థానికులు ప్రయ త్నించగా రాకపోవడంతో చివరకు పగలగొట్టారు. పెట్‌ను సురక్షితంగా బయటకు తీశారు. దీంతో కీర్తి ఊపిరి పీల్చుకుంది.