Published
Fri, Jul 29 2016 11:54 PM
| Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
మీ ఇల్లు సింగారంగానూ...!
బీచ్‌రోడ్డు: స్మార్ట్ సిటీగా అభివద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ఇలాంటి ఎక్స్‌పోను ఏర్పాటు చేసి నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినందుకు అభినందనీయమని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బీచ్‌రోడ్డులో వున్న నోవెటల్‌లో ఆర్కిటెక్చర్, ఇంటిరియర్ ఎక్స్‌పో–2016ను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్కిటెక్చర్ , ఇంటీరియర్ ఎక్స్‌పోను నగర ప్రజలు కచ్చితంగా సందర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ చైర్మన్ ఎస్‌ఎల్‌ఎన్ శాస్త్రి మాట్లాడుతూ నిర్మాణ రంగంలో కొత్తగా అందుబాటులోకి వస్తున్న నిర్మాణ సామగ్రి, ఆధునీకత నూతన విధానాలపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఐఐఏ కషి చేస్తుందని తెలిపారు. నిర్మాణ రంగంలో అందుబాటులోకి వచ్చిన నూతన పద్ధతులను తెలియజేయడమే ఈ ఎక్స్‌పో ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ ఏడాది ఐఐఏ నిర్వహించనున్న అవగాహన కార్యక్రమంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ భాగస్వామిగా ఉందన్నారు. వివిధ కాలేజీల ఆర్కిటెక్చర్ విద్యార్థుల పనితనాన్ని ఇందులో ప్రదర్శించనున్నారని తెలిపారు. ఈ ఎక్స్‌పోలో 50 సంస్థలకు చెందిన సుమారు 80 స్టాల్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఎక్స్‌పో శని,ఆదివారాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎక్స్‌పోలో వినీర్స్, లామినేట్స్, ఏసీపీ, ఫ్లోరింగ్ అండ్ డెకరేటివ్ టైల్స్, శానిటరీ వేర్, టాయిలెట్లకు సంబంధించిన వస్తువులు ప్రదర్శించనున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహించనున్నామని తెలిపారు. ఆసక్తిగల వారు గూగుల్ ప్లే స్టోర్‌లో ‘ఆర్కిటెక్చర్ అండ్ ఇంటిరియర్ ఎక్స్‌పో’ పేరుతో ఉన్న యాప్‌ను డౌన్‌లోడు చేసుకొని మీరు తీసిన అందమైన భవనాల ఫొటోలను అప్‌లోడు చేయాలని కోరారు. విజేతలకు ఆదివారం బహుమతులు అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ హరి నారాయణ న్, వుడా వైస్ చైర్మన్ బాబూరావు నాయుడు తదితరులు పాల్గొన్నారు.