మద్యం ఆరోగ్యానికి హానికరం అంటూ పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు నిపుణులు. దీని కారణంగా పలు అనారోగ్యాల బారినపడతామని చెబుతుంటారు. ముఖ్యంగా కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందంటూ హెచ్చరిస్తుంటారు. కానీ ఇది ఆల్కహాల్ సేవించడం వల్లే వస్తుందనేందుకు కచ్చితమైన ఆధారాలు లేవు. అయితే పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో ఆల్కహాల్‌కి కేన్సర్‌కి లింక్‌అప్ ఉందంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. మొత్తం నాలుగు అధ్యయనాలను ఉదహరిస్తూ సవివరంగా తెలిపారు యూఎస్ సర్జన్ డాక్టర్ వివేక్ మూర్తి. అంతేగాదు మద్యపానం సేవిస్తే.. కేన్సర్ తప్పదనే ఓ హెచ్చరిక లాంటి లేబుల్ ఉండాలని వాదిస్తున్నారు.
ఎలా కారణమంటే..
ఆల్కహాల్ కేన్సర్‌కు ఎలా కారణమవుతుందో నాలుగు కారణాలను వివరించారు.
మొదటిది శరీరంలో ఆల్కహాల్ విచ్ఛిన్నమైప్పుడు డీఎన్‌ఏతో విభేదించి కణాలను దెబ్బతీస్తుంది. కణితులు వచ్చేందుకు కారణమవుతుంది. అందుకు బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి. అలాగే దీన్ని చాలామంది వైద్యులు అంగీకరించారు.
రెండోది ఆల్కహాల్ ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. ఇది రొమ్ము కేన్సర్‌కు మార్గం సుగమం చేస్తుందని కొత్త పరిశోధనలో తేలింది. అయితే ఇది ఎలా అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది.
మూడోది ఇటలీ, యుఎస్, ఫ్రాన్స్, స్వీడన్, ఇరాన్ పరిశోధకుల బృందం దాదాపు 4 లక్షలకు పైగా కేన్సర్ కేసులను పరిశీలించగా..సుమారు 572 అధ్యయనాల్లో చాలా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. తాగేవారు, తాగనివారిగా విభజించి మరీ అంచనా వేశారు. ఆ పరిశోధనలో నోటి, గొంతు, అన్నవాహిక, కొలొరెక్టమ్, కాలేయం, స్వరపేటిక, రొమ్ము తదితర కేన్సర్‌లకు మద్యపానంతో సంబంధం ఉందని తేలింది.
నాలుగు..అధిక మద్యపానం సేవించిన వారికి మెడ, తలకు సంబంధించిన కేన్సర్ వస్తుందని సుమారు 26 పరిశోధనలో వెల్లడయ్యింది.
చివరిగా మరో ముఖ్యమైన అంశమేమిటంటే.. 26 సంవత్సరాల కాలంలో 195 దేశాలలో సంభవించిన మద్యపాన సంబంధిత మరణాలపై 2018 ప్రపంచ నివేదికలో మద్యపానం సేవించడం సురక్షితం కాదని తేలింది. ఇది ఏడు రకాల కేన్సర్‌ల బారినపడేందుకు కారణమవుతుందని వివరించారు సర్జన్ వివేక్ మూర్తి.
ఈ అధ్యయనం నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రచురితమయ్యింది. అయితే ఈ అధ్యయనం మద్యం అతిగా సేవించే వారికి, మితంగా తీసుకునే వారి మధ్య తేడాలను వివరించలేదు. ఈ పరిశోధనపై కొందరు శాస్త్రవేత్తలు విభేదిస్తున్నారు.
ఎందుకంటే..మధ్యధరా ప్రాంతంలో ఉండేవారు రోజూ వైన్ తాగుతారని, అదివారికి బలమైన ప్రయోజనాలను అందిస్తుందనేది వాదన. అలాగే మితంగా మద్యం సేవించేవారే గుండెపోటు, స్ట్రోక్, అకాల మరణానికి గురయ్యే ప్రమాదం ఉందని, రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని గుర్తించారు పరిశోధకులు.
Comments
Please login to add a commentAdd a comment