ఈ పనులతో ‘వన’గూరేదేమిటో! | today opening pushkar vanam | Sakshi
Sakshi News home page

ఈ పనులతో ‘వన’గూరేదేమిటో!

Published Fri, Nov 18 2016 10:00 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

today opening pushkar vanam

  • నామమాత్రపు అభివృద్ధికి ప్రచార్భాటాలెన్నో..
  • నేడు ప్రారంభోత్సవాలకు వస్తున్న సీఎం చంద్రబాబు
  • ‘‘రాజమహేంద్రవరం ప్రజలకు శాశ్వతంగా గుర్తుండిపోయేలా ఏదొకటి చేయాలనే ఆలోచనతో గోదావరి మహాపుష్కర వనానికి అంకురార్పణ చేస్తున్నా’’ గోదావరి మహాపుష్కరాల సమయంలో సీఎం చంద్రబాబు అన్న మాటలివి..అంతే కాదు పుష్కరాల ఆఖరిరోజు లాలాచెరువులోని రిజర్వు ఫారెస్టు ఏరియాలో సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న గోదావరి మహాపుష్కర వనానికి ఆయన శంకుస్థాపన కూడా చేశారు. 
    ఏడాది అనంతరం..
    ప్రస్తుత ఈ పుష్కర వనంలో చేపట్టిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు మరోసారి సీఎం చంద్రబాబు వస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నగర వాసులు కొందరు పుష్కర వనంలో చేసిన పనులను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. 
    – లాలాచెరువు(రాజానగరం)
     
    హడావిడిగా అభివృద్ధి పనులు 
    గోదావరి మహాపుష్కర వనానికి శంకుస్థాపన చేసి ఏడాదిన్నర కావొస్తున్న తరుణంలో ప్రారంభోత్సవాలకు వస్తున్న సీఎం కోసం ఆగమేఘాలపై ముఖద్వారాన్ని భారీ వృక్షాలతో కూడిన స్వాగత ద్వారంగా నిర్మించారు.    సుమారు 230 ఎకరాల్లో అభివృద్ధి చేయాల్సిన పుష్కర వనాన్ని ఇంత వరకూ పట్టించుకోని అధికారులు ప్రస్తుతం హడావిడిగా ప్రహరీ, ముఖద్వారం నిర్మాణాలు చేపట్టారు. ఈ ప్రాంగణంలో ఎప్పటి నుంచో ఉన్న బొటానికల్‌ గార్డె¯ŒS, ఆయుర్వేద మొక్కల పెంపకం, వివిధ రకాల వృక్షజాతుల అభివృద్ధి క్షేత్రం వంటి వాటిని కొన్నేళ్లుగా గాలికొదిలేసిన అధికారులు ఇప్పుడు వాటికి రంగులు అద్దిస్తూ పుష్కర వనంలో వాటిని కూడా కలిపేస్తున్నారు. రూ.18 లక్షల వ్యయంతో మెరై¯ŒS మ్యూజియంను అభివృద్ధి చేశారు. ఫారెస్టు అకాడమీకి సీఎం శంకుస్థాపన చేసే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు.  
     
    అభివృద్దికి నోచుకోని ’రాశి’ వనం  
    ఈ వనంలో మీ రాశిలను బట్టి మొక్కలను నాటి మీ జాతకాన్ని మార్చుకోండంటూ సీఎం స్వయంగా శ్రీకారం చుట్టిన ’రాశి’ వనం అభివృద్ధిలో నాటికీ నేటికీ పెద్దగా వ్యత్యాసం లేదు. నాడు ’రాశి’ వనంలో సీఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాటిన మొక్కలు మినహా ఇంతవరకు అదనంగా రాశి వనాన్ని విస్తరించించలేదు. ఈ ప్రాంతంలో ఇంతవరకు ప్రత్యేక బోర్డుగాని, వచ్చిన వారికి సమాధానం చెప్పేవారుగాని లేరు. 
    రూ.99 లక్షల నిధులు కేటాయించారు
    పుష్కర వనానికి ఈ సంవత్సరం బడ్జెట్‌లో కేవలం రూ.99 లక్షలు నిధులు కేటాయించారు. వీటిలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.43 లక్షలు మాత్రమే విడుదల కావడంతో వాటితోనే ప్రస్తుత అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన రూ.56 లక్షలు వస్తే మరిన్ని అభివృద్ధి పనులు జరిగే అవకాశం ఉంటుంది.    
    అభివృద్ది పనులు జరుగుతున్నాయి 
    గోదావరి మహాపుష్కర వనానికి ప్రభుత్వం రూ.99 లక్షల వరకు నిధులు కేటాయించింది. ఈ నిధులతో ఏయే పనులు చేయాలో హెడ్‌ ఆఫ్‌ ది డిపార్టుమెంట్‌ నిర్ణయించిన మేరకు కాంపౌండ్‌ వాల్‌తో రెండు ఆర్చ్‌ (ముఖద్వారాలు)లు, యోగా లా¯ŒS నిర్మిస్తున్నాం. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. రాశి, నక్షత్ర వనాలను అభివృద్ధి చేసి, వాకింగ్, సైకిలింగ్‌ పార్కులు ఏర్పాటుచేస్తాం. ఆటోనగర్‌ వైపు భద్రతాపరంగా ఫెన్సింగ్‌ వేస్తున్నాం. సోలార్‌ లైట్స్, టికెట్‌ కౌంటర్స్‌ ఏర్పాటుకు అనుమతి వచ్చింది. ప్రస్తుతం ఉన్న సై¯Œ్స ల్యాబ్, నేచరల్‌ స్టడీ సెంటర్స్‌ని పాడుచేయకుండా మరింత అభివృద్ధి చేస్తాం. అలాగే మెరై¯ŒS మ్యూజియం ఒకటి ఏర్పాటుచేస్తున్నాం.
    – ప్రభాకరరావు, డీఎఫ్‌ఓ వైల్డ్‌ లైఫ్, రాజమహేంద్రవరం 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement