మొబైల్ ఫోన్ యూజర్లకు షాక్. త్వరలో ఫోన్ బిల్లలు తడిసి మోపెడు కానున్నాయి. దేశంలోని మొత్తం లోక్‌సభ స్థానాల ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే నాలుగో రౌండ్ టారిఫ్ ధరల‍్ని పెంచేందుకు టెలికం కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పలు నివేదికల ప్రకారం..
టెలికం కంపెనీలు యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ఏఆర్‌పీయూ) ను పెంచుకునేందుకు కంపెనీలు తప్పుకుండా 25 శాతం టారిఫ్ ధరల్ని పెంచనున్నాయి. మార్కెట్‌లో కాంపిటీషన్, 5జీ టెక్నాలజీ కోసం భారీ పెట్టుపడులు ఇతరాత్ర కారణాల వల్ల టారిఫ్ ధరల పెంపు అనివార్యం కానుంది.
వినియోగదారులపై ప్రభావం
25 శాతం టారిఫ్ ధరల పెంపు భారీగా ఉన్నప్పటికీ.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల యూజర‍్లకు భరించే ఆర్ధిక సామర్ధ్యం ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా టెలికం సేవల్ని వినియోగించుకునేందుకు గాను ప్రస్తుతం పెట్టే ఖర్చు 3.2 శాతంతో పోలిస్తే పట్టణ గృహాల మొత్తం వ్యయంలో 3.6 శాతానికి పెరుగుతుందని అంచనా. అదేవిధంగా, గ్రామీణ చందాదారుల కోసం, ఈ సంఖ్య ప్రస్తుత 5.2 శాతం నుండి 5.9 శాతానికి పెరుగుతుందని అంచనా.
టారిఫ్ ధరలు పెరిగితే
టారిఫ్ 25 శాతం పెంచితే టెలికాం ఆపరేటర్ల ఏఆర్‌పీయూ 16 శాతం పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. ఎయిర్‌టెల్‌కు ఒక్కో యూజర్ నుంచి వచ్చే ఆదాయం అత్యధికంగా రూ.29, జియో 26 శాతం ఉందని యాక్సిస్ కేపిటల్ ఎస్టిమేట్ తెలిపింది.
కంపెనీలకు లాభమే
మార్చితో ముగిసిన త్రైమాసికంలో జియో ఏఆర్‌పీయూ రూ.181.7 గా ఉంది. ఎయిర్‌టెల్‌కు రూ.208, వొడాఫాన్ ఐడియాకు రూ.145 గా ఉంది. టారిఫ్ ధరలు పెరిగితే ఒక్కో యూజర్ నుంచి వచ్చే ఆదాయం పెరుగుతుంది. ఆ ప్రభావం కంపెనీ లాభాలు పెరిగేందుకు దోహదం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment