తక్కువ ధరకు టెలికం సేవలు అందించే ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కి మారాలనుకుంటున్నారా..? సిగ్నల్స్ ఎలా ఉంటాయోనని ఆలోచిస్తున్నారా..? అయితే మీకు దగ్గరలో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో ఇక్కడ తెలియజేస్తున్నాం..
పలు ప్రైవేటు టెలికాం కంపెనీలు టారిఫ్‌లు పెంచడంతో అందుబాటు ధరలో రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్న ప్రభుత్వ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వైపు చాలా మంది వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఇది ఇప్పుడు తన 4G సేవలను చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల జూలై 21న తన 4G సంతృప్త ప్రాజెక్ట్ కింద 1000 టవర్ల ఏర్పాటు లక్ష్యాన్ని సాధించింది.
ఈ నేపథ్యంలో మీరు బీఎస్‌ఎన్‌ఎల్‌కి మారాలని ప్లాన్ చేస్తుంటే, మీరు నివసిస్తున్న ప్రాంతంలో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ ఉందో లేదో నిర్ధారించుకోవాలి. మీ మొబైల్ ఫోన్‌లో చిన్న రేడియో ట్రాన్స్‌మిటర్, రిసీవర్ ఉంటుంది. ట్రాన్స్‌మిటర్ సిగ్నల్‌లను పంపుతుంది. రిసీవర్ ఇతర ఫోన్‌ల నుంచి సిగ్నల్‌లను అందుకుంటుంది. ఈ సిగ్నల్స్ బలహీనంగా ఉంటాయి. తక్కువ దూరం మాత్రమే ప్రయాణించగలవు. అందుకే సమీపంలో మొబైల్ టవర్లు ఉన్నప్పుడు మీ ఫోన్‌లో సిగ్నల్స్ ఉంటాయి.
సమీపంలో టవర్ ఉందో లేదో తెలుసుకోండి ఇలా..
ముందుగా https://tarangsanchar.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లండి
పేజీని కిందికి స్క్రోల్ చేసి, ‘మై లొకేషన్’పై క్లిక్ చేయండి.
తదుపరి పేజీలో, మీ పేరు, ఈమెయిల్, మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ని నమోదు చేయండి.
Send me a mail with OTP బటన్ పై క్లిక్ చేయండి.
మీ ఈమెయిల్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి.
తర్వాతి పేజీలో, మీ చుట్టూ ఉన్న అన్ని మొబైల్ టవర్‌లను చూపించే మ్యాప్ మీకు కనిపిస్తుంది.
ఏదైనా టవర్‌పై క్లిక్ చేస్తే సిగ్నల్ రకం (2G/3G/4G/5G), అది ఏ కంపెనీ టవర్ అనేది మీకు సమాచారం అందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment