భారత టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తమ 5జీ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. పోస్ట్ పెయిడ్, ప్రీ పెయిడ్ కస్టమర్లు అపరిమితంగా 5జీ డేటాను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. విస్తృతమైన తమ 5జీ నెట్‌వర్క్‌ను కస్టమర్లకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: SVB: దివాలా తీసిన బ్యాంకులో మనోళ్ల డిపాజిట్లు ఎంతంటే..
డేటా వినియోగంపై పరిమితులను ఎయిర్‌టెల్ తొలగించింది. దీంతో కస్టమర్లు ఇక అల్ట్రాఫాస్ట్, సురక్షితమైన 5జీ ప్లస్ సర్వీసును అపరిమితంగా ఉపయోగించుకోవచ్చు. పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు అందరితోపాటు రూ.239 ఆపైన డేటా ప్లాన్‌లను కలిగిన ప్రీ పెయిడ్ కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఇదీ చదవండి: Sandeep Bakhshi: ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా?
ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ సర్వీస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 270 నగరాల్లో అందుబాటులో ఉంది. ఈ అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్‌ను వినియోగించుకునేందుకు 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ ఉండాలి. అలాగే 5జీ నెట్‌వర్‌క పరిధిలో ఉండాలి. ఇందు కోసం ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లోకి వెళ్లి ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: ఆఫీస్‌కు రావద్దు.. ఇంట్లో హాయిగా నిద్రపోండి.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్!
Comments
Please login to add a commentAdd a comment