Plus
-
ఇరవై సార్లు పెళ్లి చేసుకున్నా: అవికా గోర్
‘‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ మొదలుకొని ఇప్పటివరకూ నేను ఆన్ స్క్రీన్‌పై కనీసం ఇరవై సార్లు పెళ్లి చేసుకుని ఉంటా. అయితే ఇది బోర్ కొట్టలేదు. పెళ్లి కూతురిలా ముస్తాబవడం నాకు చాలా ఇష్టం. మరోసారి ‘వధువు’లో పెళ్లి కూతురిగా నటించాను. థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ సిరీస్ ఆసక్తిగా సాగుతుంది’’ అని హీరోయిన్ అవికా గోర్ అన్నారు. నందు, అలీ రెజా, అవికా గోర్ కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘వధువు’. పోలూరు కృష్ణ దర్శకత్వంలో శ్రీకాంత్ మెహతా, మహేంద్ర సోని నిర్మించిన ‘వధువు’ ఈ నెల 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా అవికా గోర్ మాట్లాడుతూ–‘‘బెంగాలీ సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ ‘ఇందు’ను తెలుగులోకి ‘వధువు’గా తీసుకొస్తున్నాం. ఇలాంటి స్క్రిప్ట్‌లో నేను ఇప్పటిదాకా నటించలేదు. నాకు టీవీ సీరియల్స్ చేసిన అనుభవం ఉంది. బుల్లితెర ప్రేక్షకులకు ఎలాంటి కంటెంట్ ఇష్టమో.. అది ‘వధువు’లో ఉంటుంది. ఇక చిన్నప్పుడే నటిగా మారడం వల్ల నా పర్సనల్ లైఫ్‌కు టైమ్ కోల్పోయినా... నటిగా నేను ప్రతి రోజూ ఒక కొత్త పాత్రలో కనిపించగలుగుతున్నాను.. ప్రతి రోజూ ఒక కొత్త లైఫ్ చూస్తున్నాను. నిర్మాతగా ‘పాప్ కార్న్’ సినిమా తీయడం గర్వంగా ఉంది. ఎలాంటి హంగామా లేకుండా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా నా పెళ్లి చేసుకోవాలనుంది. ప్రస్తుతం తెలుగులో ఆది సాయికుమార్ హీరోగా రూపొందుతున్న ఒక సినిమా చేస్తున్నా. అలాగే హిందీలో కొన్ని ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాను’’ అన్నారు. -
ఎయిర్టెల్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్.. ఇక అన్లిమిటెడ్ 5జీ డేటా!
భారత టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తమ 5జీ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. పోస్ట్ పెయిడ్, ప్రీ పెయిడ్ కస్టమర్లు అపరిమితంగా 5జీ డేటాను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. విస్తృతమైన తమ 5జీ నెట్‌వర్క్‌ను కస్టమర్లకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: SVB: దివాలా తీసిన బ్యాంకులో మనోళ్ల డిపాజిట్లు ఎంతంటే.. డేటా వినియోగంపై పరిమితులను ఎయిర్టెల్ తొలగించింది. దీంతో కస్టమర్లు ఇక అల్ట్రాఫాస్ట్, సురక్షితమైన 5జీ ప్లస్ సర్వీసును అపరిమితంగా ఉపయోగించుకోవచ్చు. పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు అందరితోపాటు రూ.239 ఆపైన డేటా ప్లాన్లను కలిగిన ప్రీ పెయిడ్ కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇదీ చదవండి: Sandeep Bakhshi: ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా? ఎయిర్టెల్ 5జీ ప్లస్ సర్వీస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 270 నగరాల్లో అందుబాటులో ఉంది. ఈ అన్లిమిటెడ్ డేటా ఆఫర్‌ను వినియోగించుకునేందుకు 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ ఉండాలి. అలాగే 5జీ నెట్వర్క పరిధిలో ఉండాలి. ఇందు కోసం ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్‌లోకి వెళ్లి ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ఆఫీస్‌కు రావద్దు.. ఇంట్లో హాయిగా నిద్రపోండి.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్! -
ఆగస్టులో ఎగుమతులు.. ‘ప్లస్సే’
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు ఆగస్టులో వృద్ధినే నమోదుచేసినట్లు వాణిజ్యమంత్రిత్వశాఖ బుధవారం వెలువరించిన సవరిత గణాంకాలు స్పష్టం చేశాయి. సమీక్షా నెల ఎగుమతుల్లో 1.62 శాతం వృద్ధి నమోదయిందని, విలువలో ఇది 33.92 డాలర్లని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇదిలాఉండగా, నెలవారీగా తొలి లెక్కలు క్షీణతలో ఉండడం, అటు తర్వాత అవి వృద్ధిబాటలోకి రావడం ఇది వరుసగా రెండవనెల. జూలైలో తొలి గణాంకాలు క్షీణత (–0.76) నుంచి 2 శాతం వృద్ధికి మారాయి. ఆగస్టు విషయంలో తొలి గణాంకాల క్షీణ అంచనా మైనస్ 1.15 శాతం. -
టోకు ధరలకు ఆహారం, తయారీ సెగ
♦ జూన్‌లో ద్రవ్యోల్బణం 1.62 శాతం ♦ ఆహార ద్రవ్యోల్బణం 8.18 శాతం ♦ ఆగస్టు 9 ఆర్బీఐ రేటు కోత అంచనాలపై నీళ్లు న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా మూడవ నెలలోనూ ‘ప్లస్’లోనే కొనసాగింది. జూన్‌లో టోకు ధరల సూచీ 1.62%గా నమోదయ్యింది. టోకు సూచీలో ఆహార ధరల విభాగంలో భారీ పెరుగుదల, అలాగే సూచీలో దాదాపు 65 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగంలో ద్రవ్యోల్బణం కూడా ‘క్షీణతలోంచి’ బయటకు రావడం వంటి అంశాలు తాజా ఫలితానికి కారణం. టోకు ద్రవ్యోల్బణం సూచీ మార్చి వరకూ దాదాపు పదిహేడు నెలల పాటు అసలు పెరుగుదల లేకపోగా, క్షీణతలో కొనసాగిన విషయం తెలిసిందే. 2015 ఇదే నెలలో ఈ రేటు -2.13 శాతంగా ఉంది. ప్రధాన విభాగాలను వేర్వేరుగా చూస్తే... ⇒ ఫుడ్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ విభాగంలో రేటు 2015 జూన్‌లో -0.48 శాతం క్షీణతలో ఉంది. ఇది తాజాగా 5.5 శాతంగా నమోదయ్యింది. ఫుడ్ ఆర్టికల్స్‌లో రేటు ఏకంగా 3.12 శాతం నుంచి 8.18 శాతానికి పెరిగింది. కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలు, ప్రొటీన్ ఆధారిత ఉత్పత్తుల ధరల భారీ పెరుగుదల దీనికి కారణం. కూరగాయల ధరలు వార్షికంగా (2015 ఇదే నెలలో పోల్చితే) 16.91 శాతం పెరిగాయి. పప్పుల ధరలు ఏకంగా 27శాతం పెరిగాయి. చక్కెర ధర 26 శాతం ఎగసింది. పండ్ల ధరలు 6 శాతం ఎగశాయి. ఆలూ ధరలు 64 శాతం పెరగడం గమనార్హం. అయితే ఉల్లి ధరలు మాత్రం 29 శాతం తక్కువగా ఉన్నాయి. ఇక నాన్-ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో రేటు 1.16 శాతం నుంచి 5.72 శాతానికి చేరింది. ⇒ తయారీ రంగాన్ని చూస్తే... -0.77% క్షీణత నుంచి ప్లస్+ 1.17%కి చేరింది. రేటు కోత లేనట్లేనా...! మంగళవారం విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం 22 నెలల గరిష్ట స్థాయి 5.77 శాతానికి పెరగడంతోపాటు, తాజాగా విడుదలైన కూడా ఆహార ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉండడంతో ఆగస్టు 9 నాటి ద్రవ్య పరపతి సమీక్ష సందర్భంగా ఆర్బీఐ పాలసీ వడ్డీరేటు(రెపో)ను తగ్గించే అవకాశం లేదని ఐడీఎఫ్సీ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ ఇంద్రనీల్ పన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రేటు 6.5 శాతంగా ఉంది. -
ప్లస్ సైజ్ బ్లాగర్ కు ఇన్ స్టాగ్రామ్ సారీ!
ప్లస్ సైజ్ ఉన్నవారి ఫోటోలను డిలీట్ చేసిన ఇన్ స్టాగ్రామ్.. అనంతరం బ్లాగర్లకు క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సింగపూరియన్ ఇండియన్ బ్లాగర్ ఆర్తీ ఒలీవియా దుబే.. తాను బికినీతో ఉన్న ఫోటోలను పోస్టు చేయగా కొద్దికాలం క్రితం ఇన్ స్టాగ్రామ్ నుంచి వాటిని తొలగించారు. దీంతో ఆమె వారంపాటు ఆందోళన నిర్వహించడంతో చివరికి దారికొచ్చిన ఇన్ స్టాగ్రామ్... తప్పైపోయిందంటూ ఆమెకు క్షమాపణలు చెప్పడంతోపాటు, అనుకోకుండా ఫోటోలు డిలీట్ అయినట్లుగా వివరణ కూడ ఇచ్చింది. తన బ్లాగ్ లో 'పెంఛంట్ ఫర్ ఫ్యాషన్, ఫాట్ బ్రౌన్ ఫెమినిస్ట్' అంటూ తనకు తాను నిర్వచించుకునే బ్లాగర్ ఒలీవియా దుబే... తనతోపాటు మరో ఇద్దరు ప్లస్ సైజ్ బ్లాగర్ల బికినీ షూట్ ఫోటోలను మే 21న సైట్ నుంచి తొలగించడంతో ఆందోళన ప్రారంభించింది. తన బికిని ఫోటోలను సైట్ నుంచి తొలగించి తనను అవమానించినందుకు గాను తనకు ఇన్ స్టాగ్రామ్ అధికారికంగా క్షమాపణలు చెప్పాలంటూ జూన్ 1న తన అకౌంట్ లో ఓ నోట్ పెట్టి డిమాండ్ ప్రారంభించింది. అయితే దుబే డిమాండ్ కు దిగొచ్చిన ఇన్ స్టాగ్రామ్ ఆమె ఫోటోలను తొలగించినందుకు క్షమాపణలు చెప్పింది. కాగా ఇన్ స్టాగ్రామ్ క్షమాపణలు చెప్పినంత మాత్రాన సరిపోదని, తాను క్షమాపణలను అంగీకరించినా తదుపరి ప్రయోజనం ఉండదని, అందుకే తిరిగి తన ఫోటోలను పోస్ట్ చేయడంతోపాటు, తొలగించిన ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలోని ప్లస్ సైజ్ ఫ్రెండ్స్ అందరి ఫోటోలను పోస్ట్ చేసి, అకౌంట్లను తిరిగి ప్రారంభించాలంటూ దుబే పట్టుబడుతోంది. -
సాక్షి షాపింగ్ప్లస్ 26th December 2015
-
సాక్షి షాపింగ్ప్లస్ 19th December 2015
-
‘ప్లస్’ అయ్యే అలంకరణ
వయసు పైబడడం, ఆరోగ్యం, వంశపారంపర్యం, పని ఒత్తిడి... ఇలా రకరకాల కారణాల వల్ల అధిక బరువు ఓ బెడదలా ఇటీవల చాలామందిని వేధిస్తోంది. పెరిగిన బరువు అందానికి ‘మైనస్’ అనుకోవడం కన్నా.. దానినే ‘ప్లస్’గా మార్చుకుంటే మేలు అని భావించేవారి కోసమే ఈ కథనం... సాధారణంగా అన్ని షాపులలో జీరో (0) నుంచి ఫార్టీ (40) సైజ్ లోపు కొలతలలో రకరకాల దుస్తులు లభిస్తున్నాయి. నలభై కన్నా పై కొలతలలో ఉన్నవారిని ‘ప్లస్ సైజ్’ అంటారు. ఈ సైజ్ వారికి డ్రెస్సులు కావాలంటే మాత్రం ‘సారీ, టైలర్‌తో చెప్పి కుట్టించుకోండి..’ అని సలహా ఇస్తుంటారు. ఫ్యాషనబుల్‌గా కనిపించాలనుకుని సరైన కొలతలలో లేని దుస్తులు తెచ్చుకొని ఇబ్బంది పడటం, టైలర్ సరైన కొలతలలో డ్రెస్ కుట్టకపోవడం, తమ శరీరాకృతికి సరిపడా ఎలాంటి దుస్తులు వేసుకోవాలో, డిజైన్ చేయించుకోవాలో తెలియకపోవడం.. ఇవన్నీ అధికబరువు (ప్లస్ సైజ్) ఉన్నవారి ప్రధాన సమస్యలు. లావుగా ఉన్నా అందంగా, కాలానుగుణంగా వేషధారణ హుందాగా ఉండాలంటే... దుస్తుల ఎంపిక సరిగ్గా ఉండాలి. ఈ విషయాలపై అవగాహన పెంచుకుంటేమీ జీవనశైలి మరింత సులభంగా, మరింత సుందరంగా మారిపోతుంది. మీ శరీరాకృతి లావుగా ఉంటే... బాధాపడాల్సిన అవసరమే లేదు. ఫ్యాషన్ డిజైనర్లు. ప్లస్ సైజ్ ఉమన్ దుస్తుల ఎంపికకు ఇస్తున్న ఈ సూచనలు పాటించండి... బిగుతుగా ఉండే దుస్తులను కొనుగోలు చేయకూడదు/ధరించకూడదు. చిన్న సైజు, బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తే మరింత లావుగా కనిపిస్తారు. మరీ వదులుగా ఉండే దుస్తులను కొనుగోలు చేయకూడదు/ధరించకూడదు. ‘బాగా వదులుగా ఉండే దుస్తులు ధరిస్తే సన్నగా కనపడతాం’ అనుకోవడం అపోహ. వేలాడుతున్నట్టుగా ఉండే దుస్తులను ధరిస్తే మరింత లావుగా కనిపిస్తారు. అధికబరువున్న వారు ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్లస్ సైజ్ ఉమన్‌కు డిజైన్ చేసిన బ్రాండెడ్ దుస్తుల్లోనూ అన్నీ ఒకే తరహావి ఉంటాయి. ఒక్కోసారి ఆ డ్రెస్ కొలతలు మీకు నప్పకపోవచ్చు. అందుకని ఎంపిక చేసుకునేటప్పుడు ఒకసారి కొనుగోలు చేసే దుస్తులను వేసుకొని, అద్దంలో చూసుకొని, నప్పితేనే తీసుకోవాలి. లావుగా కనిపించే శరీర భాగాలలో ముదురు రంగులతో కవర్ చేసే డిజైన్లు గల దుస్తులను ఎంపిక చేసుకోవాలి. కాంతిమంతమైన/లేత రంగులకన్నా ఫ్యాషన్‌లో ముదురు రంగులు ఎప్పుడూ ముందుంటాయి. లావుగా ఉన్నవారు వీటిని నిరభ్యంత ధరించవచ్చు. అంతేకాదు ఈ రంగులు అధికబరువును తక్కువగా చూపిస్తాయి. వంగపండు, గోధుమ, బూడిద... రంగువి కూడా ముదురు రంగులలో ఎంపిక చేసుకోవచ్చు. అయితే టాప్ (నడుము పై భాగంలో) కలర్ ముదురు రంగులో ఎంపిక చేసుకుంటే బాటమ్ (నడుము కింది భాగంలో) లేత రంగులో తీసుకోవాలి. అధికబరువు ఉన్నవారు దుస్తులతో ఇంకాస్త బరువును పెంచుకోకూడదు. దుస్తులకు వచ్చే పెద్ద పెద్ద బటన్స్, పెద్ద పాకెట్స్, వెడల్పాటి కుచ్చులు.. ఎదుటివారి దృష్టి పడేలా చేస్తాయి. అందుకని దుస్తులపై డిజైన్స్ ఇలా అన్నీ పెద్ద పెద్దగా ఉండేవి ఎంచుకోకూడదు. ప్యాంట్స్ అయితే బ్యాక్ పాకెట్స్‌పై, టాప్స్ అయితే చేతులు లేని జాకెట్‌పై ఎంబ్రాయిడరీ లేకుండా జాగ్రత్తపడాలి. మీ వార్డ్రోబ్ నుంచితొలగించాల్సినవి..! చాలా పొట్టిగా ఉండే షార్ట్స్ వదులుగా ఉండే ట్రౌజర్స్ పొట్టి లంగాలు (మినీ స్కర్ట్స్) మామ్ జీన్స్ (నడుము, పిరుదుల భాగం ఎక్కువ వదులు ఉండేవి) రిప్డ్ జీన్స్ (అక్కడక్కడా చిరుగులు ఉన్న జీన్ ప్యాంట్స్), కార్గో ప్యాంట్స్ బ్యాగీ జీన్స్ (పూర్తి వదులుగా ఉండేవి) ఫిట్‌గా లేని బ్లేజర్స్ బ్యాగీ స్వెట్స్ పొడవు లంగాలు మెరిసే రాళ్లు, కుందన్స్, చమ్కీతో చేసిన డిజైన్లు గల దుస్తులు ఎక్కువ కుచ్చులు ఉన్న డ్రెస్సులు పెద్ద పెద్ద ప్రింట్లు ఉన్న దుస్తులు రంగురంగులుగా ఉండే కౌబాయ్ బూట్లు. ‘ప్లాట్’గా పై నుంచి కిందకు ఒకే విధంగా ఉండేలాంటి దుస్తులు తీసుకోకూడదు. మహిళలు సాధారణం గా తమ వేషధారణ ఒకే రంగు (మ్యాచింగ్)లో ఉండాలనుకుంటారు. మ్యాచింగ్ అధికమైతే ఇంకాస్త లావుగా కనిపిస్తారు. ‘కాంట్రాస్ట్’ (ఒకదానితో ఒకటి పోలిక లేనివి) కలర్స్ దుస్తులు వేసుకుంటే మేలు. ఉదా: స్కర్ట్/ప్యాంట్స్ వేసుకునేవారు అదే రంగు టీ షర్ట్ వేసుకోకూడదు. టీ షర్ట్‌పైన వేసుకునే ఓవర్‌కోట్ స్కర్ట్/ప్యాంట్ ఒకే రంగులో ఉండేలా ఎంపిక చేసుకోవాలి. సైజ్ చార్ట్! ఛాతీ పరిమాణం 41-45, నడుము పరిమాణం 33-37 హిప్ (పిరుదుల)పరిమాణం 43-47 ఉన్నవారు XXSసైజ్ దుస్తులను ... ఛాతీ పరిమాణం 77-83, నడుము 71-78 హిప్ (పిరుదుల)పరిమాణం 80-90 ఉన్నవారు XXLసైజ్ దుస్తులను ఎంపిక చేసుకోవాలి. ప్లస్ సైజ్ వారు ఆన్లైన్ చార్ట్‌ను అనుసరించవచ్చు. అలంకరణ అనేది వస్తువుల స్థాయిని పెంచాలి. మీరు లావుగా ఉంటే ధరించే ఆభరణా లు సన్నగా ఉంటే ఏ మాత్రం కనిపించవు. అందుకని మధ్యస్థం- పెద్ద సైజున్నవి ఎంచుకోవాలి. మీ కాళ్లకు తగిన మందపాటి హీల్ ఉన్న చెప్పులు ధరించాలి. అలాగే పెద్ద పర్స్/బ్యాగ్ వెంట తీసుకెళ్లాలి. ఈ తరహా ఇతర అలంకరణ వస్తువులు మిమ్మల్ని సన్నగా చూపిస్తాయి. నోట్: మరీ పెద్ద పెద్దవి కాకుండా... మీరు ఉన్న లావును కొద్దిగా అధిగమించేలా మాత్రమే మీ ఇతర అలంకరణ వస్తువులు ఉండాలనే విషయం మర్చిపోవద్దు. అలంకరణ సమయంలో మీ బరువు, మీ ఎత్తు సైజ్, ఎముక సామర్థ్యం.. ఇవన్నీ దృష్టిలోపెట్టుకోవాలి. మీ వార్డ్రోబ్లోఉండాల్సివి..! వి నెక్ గల తెల్లటి చొక్కా (బటన్ డౌన్ షర్ట్) శరీరాకృతికి సరిగ్గా సరిపడే నలుపు రంగు డ్రెస్. ఫిట్‌గా ఉండే లాంగ్ ప్యాంట్స్ ఫిటెడ్ బ్లేజర్స్ ప్రస్తుత కాలానికి తగ్గ దుస్తులు మీకు మాత్రమే ప్రత్యేకం అనిపించే స్టైల్ దుస్తులు హాఫ్ స్కర్ట్(మోకాళ్ల వరకు ఉండేది) ఎంపిక సరైనది పొట్టను కవర్ చేసే డిజైనర్ దుస్తులు. (వీటి ఎంపికలో డిజైనర్/షాప్/ ఆన్లైన్ సాయం తీసుకోవచ్చు) శరీరాకృతికి సరిగ్గా నప్పేవి, సరైన ఫిట్‌తో ఉన్న లో దుస్తులు బెల్ట్‌లు, ఆభరణాలు, పాదరక్షలు.. వీటితోనూ మీ దుస్తుల్లో కొత్త మార్పులు తీసుకురావచ్చు. దుస్తులు కుట్టించుకోవాలంటే... కుర్తా, టాప్స్ టైలర్‌తో కుట్టించుకునేటప్పుడు ‘సైడ్ ఓపెన్స్’ పిరుదుల పై భాగం వరకు పెట్టించుకోవాలి. దీని వల్ల కూర్చునేటప్పుడు డ్రెస్ ముందు భాగం పొట్టమీదకు రాకుండా ఉంటుంది. వెయిస్ట్ భాగంలో బిగుతుగా ఉండే డ్రెస్ వల్ల మరింత లావుగా కనిపించే అవకాశం ఉంది. జాకెట్టు చేతులు కుచ్చులున్నవి డిజైన్ చేయించుకుంటే చేతులు మరింత లావుగా కనిపిస్తాయి. లావుగా ఉన్నవారికి బ్రాడ్, ఓవర్ నెక్స్ సరిగ్గా నప్పుతాయి. నోట్: లావుగా ఉన్నప్పటికీ పొడవుగా ఉన్నవారు... స్లీవ్స్, ప్యాంట్స్, లెగ్గింగ్స్ సరైన ఫిట్‌తో ఉండేవి తీసుకోవచ్చు. పొట్టిగా ఉంటే నిలువు చారలు ఉన్నవి, విభిన్న రకాల రంగుల్లో ఉన్న డ్రెస్సులను ఎంచుకోవాలి. చీరలు కట్టుకునేవారు కాటన్ చీరలు కట్టుకుంటే మరింత లావుగా కనిపించే అవకాశం ఉంది. 42 - 62 అంగుళాల పరిమాణంలో ఉన్నవారి కోసం సాధారణ దుస్తుల నుంచి పార్టీవేర్ వరకు ప్లస్ సైజ్ స్టోర్లలో అన్ని రకాల బ్రాండ్లలో (టాప్స్, కుర్తీస్, లెగ్గింగ్స్, జీన్స్, టీ షర్ట్స్, పార్టీవేర్, వెస్ట్రన్‌వేర్, ట్రెడిషనల్ వేర్..) నాణ్యమైన దుస్తులు లభిస్తున్నాయి. ఇవన్నీ కాటన్, టెరీకాటన్, సిల్క్, సింథటిక్... మెటీరియల్స్‌లో లభిస్తున్నాయి. - నిర్మలారెడ్డి కర్టెసీ ప్లస్ సైజ్, పంజగుట్ట, హైదరాబాద్